• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాల‌య్యని సొంత బాబాయ్ లా...

బాల‌య్యని సొంత బాబాయ్ లా ఫీలైన శ్రీలీల‌!

| యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియ‌ర్..జూనియ‌ర్స్ స్టార్స్ అంటూ ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌డం లేదు

By - Tupaki Desk
Update: 2023-09-05 00:30 GMT

యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియ‌ర్..జూనియ‌ర్స్ స్టార్స్ అంటూ ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌డం లేదు. ఏ హీరోతో ఛాన్స్ వ‌చ్చినా సై అని ముందుకెళ్లిపోతుంది. ఓవైపు హీరోయిన్ గా న‌టిస్తూనే మ‌రోవైపు సిస్ట‌ర్ రోల్స్..సెకెండ్ లీడ్ లంటూ కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తుంది. అమ్మ‌డి తాజా లైన‌ప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. తెలుగులో ఏ భామ లేనంత బిజీగా ఉంది.

డే బై డే సొగ‌స‌రికి మార్కెట్లో మాస్ ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్ల లీగ్ కి అతి చేరువ‌లో ఉంది. 'గుంటూరు కారంలో' ఛాన్స్ అందుకోవ‌డంతో కెరీర్ ప‌రంగా మ‌రో అడుగు ముదుకు ప‌డింది. ఈ సినిమా హిట్ త‌ర్వాత అమ్మ‌డి రేంజ్ మారిపోతుంద‌ని ప్ర‌చారం షురూ అయింది. మ‌రోవైపు 'భ‌గ‌వంత్ కేస‌రి' లో న‌టసింహ బాల‌కృష్ణ త‌మ్ముడి కుమార్తె పాత్ర పోషిస్తుంది.

ఆ ర‌కంగా బాల‌య్యని సినిమాలో బాబాయ్ అని అభిమానంతో పిలుచుకుంటుంది. మ‌రి ఈ అభిమానం సినిమా వ‌ర‌కేనా? తెర వెనుక కూడా బాబాయ్ లా పీల‌వుతుందా? అంటే అలాగే ఫీల‌వుతున్న‌ట్లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసింది. 'ఈ సినిమా చేస్తున్నంతసేపు బాల‌య్య సార్ నాకు సొంత బాబాయ్‌లాగే అనిపించారు. సెట్ లో ఎంతో బాగా చూసుకున్నారు. చాలా ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవారు.

మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్యతో నటించాలని ఉంది. ఈ విషయం కూడా ఆయ‌న‌కు చెప్పాను. త‌ప్ప‌కుండా అని ప్రామిస్ చేసారు. సెట్ లో ఆయ‌న న‌టీన‌టుల‌కు ఎంతో గౌర‌వం ఇస్తారు. ఆయ‌న రెస్పెక్ట్ కి ఫిదా అయిపోయాను' అంది. ఈ బ్యూటీ మంచి న‌టే కాదు..అంత‌కు మించి గొప్ప మాట‌కారి కూడా అని ఇప్ప‌టికే నిరూపించింది. త‌న‌దైన చ‌లాకీ త‌నంతో ర‌ష్మిక లా అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో ముందుంటుంది. ఈనేప‌థ్యంలోనే శ్రీలీల‌కి సోష‌ల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

Tags:    
  • Bhagavanthkesarimovie 
  • Balakrishna 
  • Sreeleela 
  • Actresssreeleela 
  • Filmindustry 
  • Tollywood 
  • Anilravipudi 
  • Bhagavanthkesari 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS