శ్రీలీల విషయంలో ఫ్యాన్స్ హార్ట్.. ఏమైందబ్బా?
టాలీవుడ్లో కొంతకాలంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న అందాల భామ హీరోయిన్ శ్రీలీల.;
టాలీవుడ్లో కొంతకాలంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న అందాల భామ హీరోయిన్ శ్రీలీల. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో ఫుగ్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇంత వెలుగులోకి రావడానికి కారణం తన క్యూట్ గ్లామర్ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్. 'ధమాకా' సినిమాలో ఆమె చిందులేసిన మాస్ డ్యాన్సింగ్ బీట్ స్టెప్పులు.. తన క్రేజ్‌ను అమాంతం పెంచేసింది.
దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. యంగ్ హీరోస్ నుంచి బడా హీరోస్ వరకు అందరూ ఆమెతోనే సినిమా చేస్తున్నారు. అందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'స్కంద'గా ఈ సినిమా రాబోతుంది.
రీసెంట్గా ఈ సినిమా నుంచి 'నీ చుట్టూ చుట్టూ' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ఇందులో రామ్-శ్రీలీల.. ఇద్దరూ తమ డ్యాన్సింగ్ స్కిల్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను బాగానే ఇంప్రెస్ చేశారు. స్టైలిష్ కిల్లింగ్ డ్యాన్స్‌తో ఫ్లోర్‌ను షేక్ కూడా చేసేందుకు ప్రయత్నించారు. అయితే సోషల్‌మీడియాలోనూ ఈ సాంగ్ భారీగానే వ్యూస్ అందుకున్నప్పటికీ.. అది ఆశించిన స్థాయిలో హైప్ రాలేదని తెలుస్తోంది.
సాధరణంగా కొన్ని కొన్ని సాంగ్స్‌లో ట్రెండ్ సెట్టింగ్ డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి. కానీ అవి ఈ పాటలో అంతగా కనిపించలేదు. రామ్-శ్రీలీల తమవంతుగా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ.. పాట లిరిక్స్, డ్యాన్స్ కొరియోగ్రఫీ భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు.
ముఖ్యంగా శ్రీలీల ఫ్యాన్స్ ఈ విషయంలో కాస్త హర్ట్ అవుతున్నారని తెలిసింది. రామ్‌లాంటి ఎనర్జిటిక్ స్టార్‌కు ఊరమాస్ పిల్ల లాంటి యాక్టివ్ గర్ల్ శ్రీలీల తోడైతే ఆ సాంగ్ షేక్ అయిపోతుందని ఎంతగానో ఊహించారు. కానీ అది అంచనాలకు కాస్త తగ్గేసరికి కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ 'స్కంద' సినిమాలోని మిగతా పాటలైన శ్రీలీల రేంజ్‌కు తగ్గట్టు భారీ స్థాయిలో హైప్‌ను అందుకుంటాయో లేదో అని. ఇకపోతే ఈ సినిమా విషయానికొస్తే.. భారీ యక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.