శృంగారతార అని ముద్ర వేసారు: నటి సోనా
తనను శృంగార తార అని ముద్ర వేసారని, దానిని చెరిపేసేందుకు తీస్తున్న సినిమా స్మోక్ అని వెల్లడించారు.
తనను శృంగార తార అని ముద్ర వేసారని, కానీ తనలో ఎవరికీ తెలియని కోణాలు ఉన్నాయని తమిళ నటి సోనా అన్నారు. సోనా ఆంటీగా పాపులరైన నటి సోనా తన జీవితకథతో సినిమాని స్వయంగా తీస్తున్నానని ప్రకటించారు. ఇందులో నిజాలను చూపిస్తానని రాజకీయాలు ఉండవని అన్నారు.
నటి సోనా హైడెన్ ఇప్పటికీ వరుస అవకాశాల్ని అందుకుంటున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం, నటి సోనా 'పచ్చ మాంగా' అనే మలయాళ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ చిత్రంలో నటుడు ప్రతాప్ పోతన్ కూడా నటించారు. అయితే సోనా షకీలా అడుగుజాడలను అనుసరిస్తోందని కూడా విమర్శలొచ్చాయి. అయితే అప్పట్లోనే సోనా స్పందిస్తూ.. ఇకపై గ్లామర్ పాత్రల్లో కనిపించనని స్టేట్మెంట్ ఇచ్చింది. బాలు మహేంద్ర సర్ టచ్‌లో క్లాసిక్ లైన్స్‌లో ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన చిత్రం పచ్చమంగ అని తెలిపారు.
ఇప్పుడు తన జీవితకథతో రూపొందే సినిమా'స్మోక్'కి సోనా స్వయంగా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికరంగా దర్శకురాలిగా డెబ్యూకి ముందే దర్శకత్వం, సినిమాటోగ్రఫీలో శిక్షణ పొందానని సోనా తెలిపారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, ఎంతో కష్టపడ్డాని తెలిపిన సోనా ఇప్పటివరకూ దాదాపు 150 చిత్రాల్లో నటించారు.
తనను శృంగార తార అని ముద్ర వేసారని, దానిని చెరిపేసేందుకు తీస్తున్న సినిమా స్మోక్ అని వెల్లడించారు. ఇందులో 99.9శాతం నిజాలు చెబుతానని తెలిపారు. లైఫ్ లో పరిస్థితులు ప్రజల మార్గాన్ని నిర్ధేశిస్తాయని ఎవరూ కావాలని దిగజారరని కూడా సోనా అన్నారు.
సోనా ఒక భారతీయ నటి, నిర్మాత. ఆమె పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించింది. 2001లో తమిళ చిత్రం 'పూవెల్లమ్ ఉన్ వాసం'లో తొలిసారిగా నటించింది. 2002లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. సోనా నటించిన చిత్రాలు: తమిళ చిత్రం: పూవెల్లం ఉన్ వాసం (2001), తెలుగు సినిమా: విలన్ (2003), మలయాళ చిత్రం: రౌద్రం (2008), కన్నడ చిత్రం: నామ్ యెజమన్రు (2009)