స‌రిహ‌ద్దులు చెరిపేసిన మృణాల్‌కి అరుదైన గౌర‌వం

భాష స‌రిహ‌ద్దుల్ని దాటి స‌త్తా చాటిన న‌టిగా మృణాల్ ఠాకూర్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభించిన ఏడాదిలోనే డైనమిక్ న‌టిగా బహుముఖ నటిగా గుర్తింపు పొందిన‌ మృణాల్ ఠాకూర్ ని అరుదైన అవార్డు వ‌రించింది.;

Update: 2023-08-06 06:04 GMT

భాష స‌రిహ‌ద్దుల్ని దాటి స‌త్తా చాటిన న‌టిగా మృణాల్ ఠాకూర్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభించిన ఏడాదిలోనే డైనమిక్ న‌టిగా బహుముఖ నటిగా గుర్తింపు పొందిన‌ మృణాల్ ఠాకూర్ ని అరుదైన అవార్డు వ‌రించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ప్రతిష్టాత్మకమైన డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డుతో సత్కరించనుంది. ఈ అవార్డు మృణాల్ అసాధారణ ప్రతిభకు గొప్ప ప‌నిత‌నానికి నిదర్శనం. భారతీయ సినిమా ప్రపంచంలో ప‌లు భాష‌ల్లో విభిన్న పాత్రల్లో అత్యుత్తమ ప్రదర్శనలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్ సమకాలీన సినిమాలలో అత్యంత డిమాండ్ ఉన్న నాయిక‌ల్లో ఒకరిగా వేగంగా ఎదిగారు. అందుకే ఇప్పుడు ఈ అవార్డుకు అర్హ‌త సాధించారు.

ఆగస్ట్ 11న పుర‌స్కార‌ప్ర‌ధానం జ‌ర‌గ‌నుంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ వార్షిక గాలా అవార్డు నైట్ సందర్భంగా మృణాల్ ఠాకూర్‌కి డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డును ప్రదానం చేయనున్నారు. తన కెరీర్‌లో కీలకమైన మైలురాయిని అందుకున్న వేళ‌ ఈ గుర్తింపు ద‌క్క‌నుంది. దక్షిణ భారత సినిమా ప్రపంచంలోకి ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన ఈ న‌టి `లవ్ సోనియా`లో సోనియా పాత్రతో మెప్పించింది. మృణాల్ తొలి తెలుగు చిత్రంలో సీతా మహాలక్ష్మిగా ఆకర్షణీయమైన నటనతో మృణాల్ ఠాకూర్ తన ముద్ర వేయడానికి అప్రయత్నంగా భాషల‌కు అతీతంగా సరిహద్దులను దాటింది. హిందీ తెలుగు మరాఠీ సినిమాల్లో చెప్పుకోదగ్గ ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌న సినీప్రయాణం భాషాపరమైన అడ్డంకులను అధిగమించింది.

OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులను ఆకర్షించిన ఘోస్ట్ స్టోరీస్-లస్ట్ స్టోరీస్ 2 వంటి ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్‌లలో ఆమె పాత్రల ద్వారా పెద్ద స్క్రీన్ - డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రెండింటిలోనూ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ అద్భుతమైన ఎదుగుదల కీర్తించ‌బ‌డింది. దుల్కర్ సల్మాన్‌ సహా కొంద‌రు అగ్ర హీరోలతో న‌టించింది. త్వరలో నానితో హాయ్ నాన్న .. విజయ్ దేవరకొండతో మరొక ప్రాజెక్ట్‌లో కనిపిస్తుంది.

స‌రిహ‌ద్దులు చెరిపేస్తాను...

ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. “ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డును అందుకోవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు భాషలను సంస్కృతులను మించిన శక్తిగా చూస్తున్నాను. ఒక కళాకారిణిగా నేను ఎల్లప్పుడూ విస్తృత ప‌రిధిని క‌లిగిన‌ పాత్రలను అన్వేషించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ అవార్డు సరిహద్దులను బ్రేక్ చేసి ముందుకు తీసుకెళ్లడానికి నన్ను సవాలు చేసే స్ఫూర్తినిచ్చే పాత్రలను కొనసాగించడానికి నన్ను ప్రేరేపిస్తుంది. నాకు లభించిన అవకాశాలకు నేను కృతజ్ఞురాలిని. ఈ అద్భుతమైన సినిమా ప్రయాణంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహిస్తూ చాలా సంతోషిస్తున్నాను” అని అంది.

Tags:    

Similar News