సిక్కిం వరదల్లో సినీ నటి మిస్సింగ్.. అమ్మని కనిపెట్టండి ప్లీజ్..!

సిక్కిం వరదల్లో తన తల్లి సరళ చిక్కుకున్నారని ఆమెను కనిపెట్టాలని అమెరికాలో ఉన్న సరళ కూతురు నబిత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2023-10-07 06:47 GMT

సిక్కింలో కుంభవృష్టిగా కురిసిన వర్షాల వల్ల అక్కడ భారీ సంఖ్యలో ఆర్థిక నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వరదల్లో ఎంతో మంది ప్రజలు కూడా ఆచూకి లేకుండా పోయారు. ఈ వరదల్లో తెలుగు సినీ నటి సరళ కుమారి కూడా కనిపించట్లేదని సమాచారం. సిక్కిం వరదల్లో తన తల్లి సరళ చిక్కుకున్నారని ఆమెను కనిపెట్టాలని అమెరికాలో ఉన్న సరళ కూతురు నబిత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.


1983లోనే మిస్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపికైన సరళ కుమారి ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. దానవీర శూరకర్ణ, సంఘర్షణ లాంటి గొప్ప చిత్రాల్లో ఆమె నటించారు. సరళ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 2న ఫ్రెండ్స్ తో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. సిక్కిం వెళ్లే ముందు ఈ టూర్ గురించి సరళ తన కూతురికి సమాచారం ఇచ్చారు.

సిక్కింలో స్థానిక హోటల్ లో వారు బస చేసిన తర్వాత వారి వివరాలు తెలియట్లేదని.. అయితే సడెన్ గా వచ్చిన వరదల వల్ల సరళ కుమారి ఆచూకి కనిపెట్టలేకపోతున్నారు. సరళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆమె కూతురు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 3న అమ్మతో చివరగా మాట్లాడాను ఆ తర్వాత నుంచి తన నుంచి ఎలాంటి సమాచారం లేదని సరళ కూతురు చెబుతున్నారు. వార్తల్లో వదల గురించి తెలిసి అమ్మ ఆచూకీ గురించి కంగారు పడుతున్నట్టు వెల్లడించారు. ఆర్మీ హాట్ లైన్ నంబర్లకు ప్రయత్నించినా అవి సరిగా పనిచేయడం లేదు.. మా అమ్మని కనిపెట్టండి అంటూ తెలంగాణా ప్రభుత్వాన్ని సరళ కుమారి కూతురు రిక్వెస్ట్ చేశారు.

సిక్కిం లో ఆకస్మిక వరదల వల్ల ఇప్పటికే చాలా మంది ఆచూకి గల్లంతైంది. ప్రభుత్వం పరిస్థితిని అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సరళ కుమారి మిస్సింగ్ తో తెలంగాణాకు సంబందించిన ఇంకా ఎవరైనా సిక్కిం వరదల్లో ఉన్నారా అన్న ప్రకారంగా తెలంగాణా ప్రభుత్వం వారిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు తగిన ఏర్పాట్లను చేయాలని చూస్తుంది.

Tags:    

Similar News