ఇక చాలు.. సోలోగా జీవించడం నేర్చుకుంటున్న శ్రీలీల
పెళ్లిసందడి సినిమాతో తెరంగేట్రం చేసింది శ్రీలీల. ఆ తర్వాత ధమాక సినిమాతో భారీ విజయం అందుకుందీ అమ్మడు.;
పెళ్లిసందడి సినిమాతో తెరంగేట్రం చేసింది శ్రీలీల. ఆ తర్వాత ధమాక సినిమాతో భారీ విజయం అందుకుందీ అమ్మడు. ఇక తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలతో దూసుకుపోయింది. రవితేజ, మహేశ్ బాబు, నితిన్, లాంటి బడా హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కెరీర్ ప్రారంభంలో ఈమె జోరు చూసి షాక్ అయ్యారు. వరుస సినిమాలతో ప్రతి మూడు నాలుగు నెలలకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
దీంతో కన్నడ, తెలుగే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఆమె కెరీర్ లో ఎదుగుదలకు శ్రీలీల తల్లి స్వర్ణలతే ముఖ్య కారణం. శ్రీలీలను ఆమె తల్లి మొదట్నుంచీ ప్రోత్సహిస్తూ వస్తోంది. ముఖ్యంగా శ్రీలీల ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె వయసు చిన్నది కావడంతో తల్లి మద్దుతుగా నిలిచారు. శ్రీలీలతో పాటుగా సెట్స్ దాకా వెళ్లడం, షెడ్యూల్ అరేంజ్ మెంట్, రెమ్యూనరేషన్, సినిమా స్ర్కిప్ట్ వినడం ఇలాంటి పనులన్నీ స్వర్ణలత చూసుకునేవారు.
అలా టాలీవుడ్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని ప్రోత్సహించడం ద్వారానే శ్రీలీల తన పరిధి, మార్కెట్ ను పెంచుకుంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. ఇప్పటికే 10కి పైగా సినిమాలు, పలు ఇండస్ట్రీలో పని చేయడంతో శ్రీలీల క్రమంగా తన కెరీర్ వ్యవహారాలను స్వయంగా నిర్వహించడం నేర్చుకుంటోంది. కెరీర్‌లోని ప్రతి అంశాన్ని తల్లి మార్గదర్శకంలో కాకుండా తానే స్వయంగా నిర్వహించుకోవాలి అని అనుకుంటోంది. అందుకే సోలోగా జీవించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటుందట.
ఇటీవల జగపతి బాబుతో జరిగిన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలోనే శ్రీలీల ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని నెలల క్రితం వరకు, ఒకే రూమ్ లో తన తల్లి లేకుండా నిద్రపోలేదని వెల్లడించింది. అయితే, కాలక్రమేణా ఆమె సోలో లైఫ్ జీవించడానికి అలవాటు పడటం ప్రారంభించిందట. అందుకే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తన ప్రయాణాన్ని తాను చక్కబెట్టేసుకుంటుంది.
శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హరీశ్ శంకర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.