పాపం రాధిక.. హీరోయిన్‌కి తక్కువ గెస్ట్‌కి ఎక్కువ
టాలీవుడ్‌లో మెహబూబా సినిమాతో అడుగు పెట్టిన నేహా శెట్టి కెరీర్ ఆరంభం నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొంది.;
టాలీవుడ్‌లో మెహబూబా సినిమాతో అడుగు పెట్టిన నేహా శెట్టి కెరీర్ ఆరంభం నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయితే లక్కీగా సిద్దు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రను పోషించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు, రాధిక పాత్ర గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగానే సిద్దు జొన్నలగడ్డ సినిమాలకు మాస్ ఆడియన్స్‌లో మంచి ఆధరణ ఉంటుంది. అలాంటి హీరోకు జోడీగా నటించడం ద్వారా రాధిక మంచి బ్రేక్ దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ డీజే టిల్లుతో పాటు టిల్లు స్క్వేర్ సినిమాలో నటించినా కూడా నేహా శెట్టికి బ్రేక్ దక్కలేదు. అందంతో పాటు, అభినయం ఉన్న ఈ అమ్మడికి లక్ కలిసి రాకపోవడంతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకున్నా బ్రేక్ దక్కడం లేదు.
డీజే టిల్లులో హీరోయిన్‌గా నేహా శెట్టి
గత ఏడాది టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేహా శెట్టి మరోసారి రాధికగా అలరించింది. కానీ ఆ సినిమా నేహా శెట్టికి మరిన్ని ఆఫర్లు తెచ్చి పెట్టలేదు. అందులో నేహా శెట్టి పాత్ర గెస్ట్ రోల్‌కే పరిమితం అయింది. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్వ్వేర్‌లో హీరోయిన్‌గా నటించి డామినేట్ చేసింది. అందుకే నేహా శర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ లక్కీగా విశ్వక్ సేన్ తో కలిసి ఈమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది. ఆ సినిమాలో అందంతో పాటు అభినయంతో మెప్పించింది. అయినా కూడా మరిన్ని ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తట్టలేదు. దాంతో ఈమె కెరీర్ ఖతం అని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కోలీవుడ్‌లో ఈ అమ్మడికి మొదటి అవకాశం దక్కింది. చాలా మంది కోలీవుడ్‌లో ఈమె కెరీర్ గురించి పెద్దగా ఊహించేసుకున్నారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచిందని చెప్పాలి.
ప్రదీప్ రంగనాథన్‌కి జోడీగా..
కోలీవుడ్ హ్యాపెనింగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా మమిత బైజు నటించింది. అయితే ట్రైలర్‌లో, ప్రమోషనల్ స్టఫ్‌లో నేహా శెట్టి కనిపించడంతో డ్యూడ్‌లో లక్కీగా ఈ అమ్మడికి ఛాన్స్ దక్కింది. ఇక కోలీవుడ్‌లో రాధిక దున్నేయడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ డ్యూడ్ సినిమా విడుదల తర్వాత ఆమె సన్నిహితులు, అభిమానులు, ఆమె గురించి మాట్లాడుకున్న వారు అంతా కూడా నోరు వెళ్లబెట్టారు. డ్యూడ్ సినిమాలో ఈ రాధిక కనిపించింది చాలా తక్కువ సమయం అనాలి. అలాంటి పాత్రను చాలా ముఖ్యమైన పాత్ర, కెరీర్ సెటిల్ అయ్యే పాత్ర అంటూ కొందరు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా అనిపించింది. నేహా శెట్టి ఈ పాత్రతో కోలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందా అంటే ఖచ్చితంగా కష్టమే అని చెప్పాలి.
డ్యూడ్ సినిమా హిట్ అయినా నేహాకి..
డ్యూడ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మమితకి మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా ప్రదీప్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో పాటు వసూళ్ల పరంగా నిర్మాతలు, బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతగా సినిమాకు మంచి స్పందన వచ్చినా కూడా నేహా శర్మ పాత్ర గురించి పెద్దగా చర్చ జరగక పోవడం, ఆమె పాత్ర ను ప్రేక్షకులు గుర్తించక పోవడం విచారకరం అంటూ ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూడ్ సినిమాలో ఈ రాధిక హీరోయిన్‌కి తక్కువ గెస్ట్ పాత్రకు ఎక్కువ అన్నట్లుగా ఉందని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ముందు ముందు అయినా నేహా శర్మ తన అందం, ప్రతిభకు తగ్గట్లుగా మంచి ఆఫర్లు దక్కించుకోవాలని, ఇలాంటి గెస్ట్ రోల్స్‌కు ఆమె నో చెప్పాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇటీవల ఈమె ఓజీలో ఐటెం సాంగ్‌తో వచ్చింది. ఆ పాట కూడా ఈమె కెరీర్‌కి కాస్త అయినా ఊతం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.