శృతిహాసన్ మొదలు ఇమాన్వీ వరకూ.. ప్రభాస్ ఇంటి భోజనాన్ని రుచి చూసిన హీరోయిన్స్ వీళ్ళే!
ఇండస్ట్రీలో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు మంచి గుర్తింపు లభించింది.;
ఇండస్ట్రీలో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం చేస్తున్న ప్రతి ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతుంది.
ప్రభాస్ టాలెంట్ గురించి.. ఆల్రెడీ సినిమాలు ప్రూవ్ చేసే దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అలానే ప్రభాస్ సినిమాలు, ప్రభాస్ క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో ప్రభాస్ ఫుడ్ కూడా అంతే పాపులర్ అయింది. చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇంట్లో ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చూడని వెరైటీ ఫుడ్స్ ను అందరికీ రుచి చూపిస్తుంటాడు ప్రభాస్. ప్రభాస్ తో పని చేయటం అనేది ఒక అదృష్టం అని ఇప్పటికే చాలామంది దర్శకులు కూడా చెబుతూ ఉంటారు.
శృతిహాసన్ నుంచి ఇమాన్వి వరకు
ప్రభాస్ అందరికీ అద్భుతమైన ఫుడ్ పెడతాడు అని ఇప్పటివరకు అతనితో పని చేసిన చాలా మంది తెలిపారు. గతంలో సలార్ సినిమాకి పని చేసినప్పుడు కూడా శృతిహాసన్ తన ఫుడ్ గురించి చాలా మాటలు చెప్పారు.
రాజా సాబ్ సినిమా చేస్తున్నప్పుడు నిధి అగర్వాల్, అలానే మాళవిక మోహనన్ కూడా ప్రభాస్ ఫుడ్ వీడియోలను అప్పట్లో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాడు.
దేవుడు ఏదైనా వరం అందిస్తే ప్రభాస్ చెఫ్ ను కిడ్నాప్ చేయాలి అనే కోరికను చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సీతారామం వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత హను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలవాటు ప్రకారం తాజాగా ఇమాన్వికి కూడా ప్రభాస్ ఫుడ్ పంపించారు. ఈ విషయాన్ని స్వయంగా ఇమాన్వి ఇంస్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేశారు.
ఇమాన్వి కోసం చాలా వెరైటీ వంటలను తయారు చేయించారు ప్రభాస్. హార్ట్ మరియు కడుపు నిండిపోయింది థాంక్యూ ప్రభాస్ గారు అంటూ ఇమాన్వి వీడియో షేర్ చేస్తూ రాసుకొచ్చారు.
ప్రభాస్ ఫుడ్ గురించి చాలామంది సెలబ్రిటీలు ఇలా వీడియోలు పెడుతూ ఉంటే ఇప్పటివరకు ప్రభాస్ తో పని చేయని చాలా మందికి కనీసం ఫుడ్ కోసమైనా ప్రభాస్ తో పని చేయాలి అనే కోరిక కలిగించేలా ఉన్నాయి. ఇది వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా కూడా అక్కడక్కడా ఇటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.