అనసూయకు హేమ కౌంటర్.. మాటలు తగ్గించుకోవాలంటూ..
ఇక్కడితో విషయం తగ్గిపోతుందనుకుంటే ఇప్పుడు నటి హేమ మరోలా రియాక్ట్ అయ్యారు.
అనసూయ భరద్వాజ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరింత కాంట్రవర్సీగా మారుతున్నాయి. ‘జై శ్రీరామ్’ నినాదం చేసే కొందరి ప్రవర్తన గురించి ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మొదట వివాదం మొదలైంది. ఆ తర్వాత అనసూయ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తన పూర్తి మాటలు చూడకుండా కొన్ని క్లిప్స్ మాత్రమే వైరల్ చేస్తున్నారని చెప్పారు. తాను ఏ మతాన్ని లేదా సనాతన ధర్మాన్ని తప్పు పట్టలేదని, సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే, వ్యక్తిగతంగా దాడులు చేసే కొందరి గురించే స్పందించానని తెలిపింది. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, హనుమంతుడి భక్తురాలినని కూడా చెప్పారు.
ఇక్కడితో విషయం తగ్గిపోతుందనుకుంటే ఇప్పుడు నటి హేమ మరోలా రియాక్ట్ అయ్యారు. అనసూయ తన నోటి దురుసు తగ్గించుకోవాలని కాస్త గట్టిగానే మాట్లాడారు. ఎవరైనా అనసూయను తిడితే వాళ్లను ఉద్దేశించి మాట్లాడాలని, వాళ్లు చేసిన తప్పుకు దేవుడిని మధ్యలోకి తీసుకురావడం ఎందుకని ప్రశ్నించారు. తప్పు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని అన్నారు.
అనసూయకు ధైర్యం ఉంటే తనను ఇబ్బంది పెట్టిన వాళ్లు ఎవరో పేర్లు చెప్పాలని కూడా హేమ అన్నారు. ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే వాళ్ల పేర్లు బయటపెట్టి ప్రశ్నించవచ్చని చెప్పారు. కానీ ఆ సందర్భంలో హిందూ ధర్మం, దేవుడి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనసూయ చేసిన వ్యాఖ్యల్లో తనకు అభ్యంతరం ఉన్న విషయం ఇదేనని హేమ వివరించారు.
అలాగే దేవుడి పేరు చెప్పుకునే వాళ్లందరినీ ఒకేలా చూడకూడదనే విధంగా కూడా హేమ మాట్లాడారు. కొంతమంది చేసే పనులను తీసుకుని దేవుడి పేరు లేదా ధర్మంతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఎవరు తప్పు చేస్తే వాళ్లనే నిలదీయాలని, ఆ విషయంలో అనసూయ మరింత స్పష్టంగా మాట్లాడాల్సిందని పేర్కొన్నారు.
అనసూయ తర్వాత ఇచ్చిన క్లారిటీ గురించి కూడా హేమ ప్రస్తావించారు. మొదట మాట్లాడిన మాటలపై వివాదం వచ్చిన తర్వాత వివరణ ఇవ్వడం కంటే, ముందే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో క్లియర్‌గా చెబితే ఇంత చర్చ వచ్చేది కాదనేలా స్పందించారు. అనసూయపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్య లేదని కూడా హేమ చెప్పారు.
ఇక అనసూయ మాత్రం తన మాటలను వేరే అర్థం వచ్చేలా ప్రచారం చేశారని ఇప్పటికే వివరణ ఇచ్చారు. తాను హిందువునని, సనాతన ధర్మాన్ని పాటిస్తానని, హనుమంతుడి భక్తురాలినని కూడా తెలిపారు. ఇప్పుడు హేమ మాత్రం వ్యక్తులతో ఉన్న సమస్య గురించి మాట్లాడేటప్పుడు దేవుడిని, ధర్మాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో అనసూయ వ్యాఖ్యలపై మొదలైన వివాదం హేమ స్పందనతో మరోసారి వైరల్ గా మారింది. ఇక నెక్ట్స్ ఈ కామెంట్స్ కు అనసూయ మరేదైనా వివరణ ఇస్తారో లేదో చూడాలి.