ఇద్దరు పిల్లల తల్లి, సర్జరీకి ముందే... ట్రోల్స్‌కి రియాక్షన్‌

ఇండస్ట్రీలో హిట్‌ పడ్డా, ఫ్లాప్‌ పడ్డా ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్లాప్ అయితే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది.;

Update: 2025-08-19 08:01 GMT

ఇండస్ట్రీలో హిట్‌ పడ్డా, ఫ్లాప్‌ పడ్డా ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్లాప్ అయితే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక సీనియర్ హీరోయిన్స్‌ను చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇరవై ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి అన్షు ను నెటిజన్స్ దారుణంగా టార్గెట్‌ చేశారు. ఆ విషయం ఆమె షేర్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌ను చూస్తే అర్థం అవుతుంది. సాధారణంగానే హీరోయిన్స్‌ గురించి పెద్ద ఎత్తున నెగిటివిటీ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కానీ అన్షు పై నెగిటివ్ కామెంట్స్ కు పెద్దగా కారణం ఏమీ లేదు. ఆమె చాలా ఆలస్యంగా రీ ఎంట్రీ ఇవ్వడం, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించాలి అనుకోవడం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను సోషల్ మీడియాలో ఒక వర్గం వారు మిమ్ములను అభిమానిస్తున్నాం అంటూనే విమర్శిస్తున్నారు.


20 ఏళ్ల తర్వాత అన్షు రీ ఎంట్రీ

ఆ విషయాన్ని అన్షు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి మీరు ఎందుకు ఇలాంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. ఇలాంటి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా ఆలస్యం అని మీకు అనిపించలేదా.. అప్పుడు అయిన మీరు ఆలోచించాల్సింది కదా అని ఒకరు కామెంట్‌ చేశారు. సర్జరీకి ముందు మీరు చాలా అందంగా ఉండేవారు, ఇప్పుడు మీ అందం తగ్గింది, సర్జరీ చేయించుకోవాలని ఎందుకు అనిపించింది. సర్జరీ వల్ల మీరు అందం కోల్పోయారు అని మీకు అర్థం కావడం లేదా అంటూ కొందరు అన్షును ప్రశ్నించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అన్షు స్ట్రాంగ్‌ రియాక్షన్‌

ఇంకా చాలా మంది చేసిన నెగిటివ్‌ కామెంట్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన అన్షు అందరికీ భలే రిప్లై ఇచ్చింది. నేను ఎలా ఉండాలి అనుకుంటానో అలా ఉంటాను, అంతే కాకుండా ఏదైనా జరగడానికి సమయం అంటూ ఉండదు. ఏమైనా ఏయాలి అనుకుంటే ఆలస్యం అయిందా, ముందే చేస్తున్నామా అని ఆలోచించకుండా ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయాలి అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఏ పనికి ఎప్పుడూ ఆలస్యం కాదు అన్నట్లుగా ఆమె పోస్ట్‌లో పెట్టింది. సోషల్‌ మీడియాలో ఎంతగా నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా తాను స్పందించను అంది. అంతే కాకుండా ముందు ముందు కూడా తాను సినిమాల్లో నటించడంతో పాటు, వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రభాస్ రాఘవేంద్రలో అన్షు హీరోయిన్‌

2002లో మన్మధుడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన అన్షు కేవలం నాలుగు సినిమాలు చేసి కనిపించకుండా పోయింది. మన్మధుడు సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో అన్షుకి వెంటనే ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంది. ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమాను చేసింది. ఆ సినిమా నిరాశ పరచినా కూడా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. అందుకే అన్షు మరింతగా బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మిస్సమ్మ, జై సినిమాల తర్వాత అన్షు కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రావు రమేష్‌ కి జోడీగా ఈ సినిమాలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. మజాకా సినిమా తర్వాత అన్షు కి రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. అతి త్వరలోనే ఆ సినిమాలు సెట్స్ పైకి వెళ్లి, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News