ఆ హిట్టు మూవీ ప్రభాస్ చేయాల్సింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నారు.;

Update: 2023-09-03 05:53 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. అతని డిజాస్టర్ మూవీ కూడా వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు ఇండియాలోనే హ్యుజ్ బజ్ ఉన్న మూవీస్ గా ఉన్నాయి. ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ కూడా ఏకంగా 350 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టింది.

బాహుబలి కంటే ముందు ప్రభాస్ చేసిన మిర్చి మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. బాహుబలి మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. అదే ఏడాది తమిళంలో జయం రవి తని ఒరువన్ సినిమా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జయం రవి ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. నిజానికి ఈ మూవీ కథని మోహన్ రాజా ప్రభాస్ ని దృష్టిలో ఉంచుకొని సిద్ధం చేసారంట.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తని ఒరువన్ స్టోరీని ముందుగా ప్రభాస్ కి నేరేట్ చేయడం జరిగిందంట. అయితే ప్రభాస్ ఆ సమయంలో లవ్ స్టోరీ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు చెప్పారంట. దీంతో ప్రభాస్ తో పట్టాలు ఎక్కాల్సిన ఆ ప్రాజెక్ట్ కాస్త జయం రవి చేతికి వెళ్ళింది. దాంతో అతను బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

తరువాత ఇదే స్టోరీని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ చేశారు. రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ ధృవ టైటిల్ తో తని ఒరువన్ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. అలా ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకోవడమే కాకుండా ఇద్దరు హీరోలు ఆ స్టోరీతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకోవడానికి కారణం అయ్యారు. ఇది నిజంగా విశేషమని చెప్పాలి.

ధృవ మూవీ తర్వాత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాని స్టార్ట్ చేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. తని ఒరువన్ మూవీ మిస్ చేసుకున్న బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తనని తాను షోకేస్ చేసుకున్నారు.

Tags:    

Similar News