ఐష్‌తో బ్రేకప్.. నా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పండి!- అభిషేక్
ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ జంట విడిపోయారంటూ చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి.;
ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ జంట విడిపోయారంటూ చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. అయితే ఏడాది కాలంగా ఇలాంటి నెగెటివ్ వార్తలను, పుకార్లను ప్రచారం చేసిన వారిపై అభిషేక్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసారు. తన అసహనం వ్యక్తం చేసారు. ఏదైనా ఉంటే నా ముఖంపై సూటిగా మాట్లాడండి! అంటూ సవాల్ విసిరారు. ఎక్కడో కంప్యూటర్ తెరవెనక కూర్చుని ఇలాంటివి రాయడం కాదు.. ధైర్యం ఉంటే నా ముందుకు రండి! అంటూ ఇప్పుడు మరోసారి ఛాలెంజ్ చేసారు అభిషేక్ బచ్చన్. ఎట్టకేలకు ఐష్ తో బ్రేకప్ గురించి అభిషేక్ బచ్చన్ మౌనం వీడారు
ఇలాంటి నెగెటివ్ వార్తలను బయటపెట్టడం ఒక కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నాడు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తాను ఎటువంటి వివరణ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ``గతంలో నా గురించి రాసిన విషయాలు నన్ను ప్రభావితం చేయలేదు. కానీ నేడు నాకు కుటుంబం ఉంది. వారందరినీ బాధపెడుతోంది. నేను ఏదైనా సమాధానమిచ్చినా దానిని ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రతికూల వార్తలు అమ్ముడుపోతాయి`` అని అన్నారు. ``నువ్వు నేను కాదు. నువ్వు నా జీవితాన్ని గడపవు. నేను ఎవరికి జవాబుదారీగా ఉన్నానో వారికి నువ్వు జవాబుదారీగా ఉండవు`` అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసారు. ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. వారంతా సృష్టికర్తకు సమాధానం చెప్పాలి. నేను ప్రభావితం కాను. అయితే ఈ గేమ్ లో కుటుంబాలు ఉన్నాయి.. అని అన్నారు.
ఆన్‌లైన్ నన్ను ద్వేషించేవారంతా స్వయంగా నన్ను ఎదుర్కోవాలని సవాలు చేసిన అభిషేక్ బచ్చన్ ఇలా అన్నాడు, ``మీరు ఇంటర్నెట్‌లో చెప్పాలనుకుంటే, నా ముఖంపై చెప్పడానికి నేను మీకు ధైర్యం ఇస్తున్నాను. కానీ ఆ వ్యక్తికి ఎప్పటికీ నా ముఖం మీద వచ్చి ఈ విషయం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎవరైనా వచ్చి నా ముఖం మీద ఏదైనా చెబితే, వారికి నమ్మకం ఉందని నేను భావిస్తాను. నేను దానిని గౌరవిస్తాను.
అభిషేక్ తదుపరి `కాళీధర్ లాపాట`లో కనిపిస్తాడు. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దైవిక్ భాగేలా,బ జీషన్ అయూబ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. జూలై 4న జీ5లో ప్రీమియర్ అవుతుంది.