ఇండస్ట్రీలో లెజెండరీ తనయుడి ఫోన్లు కూడా ఎత్తరా?
ఇక అభిషేక్ బచ్చన్ హీరో అయిన కొత్తలో ఆయన ముందు అమితాబచ్చన్-జయాబచ్చన్ లా గారాల బిడ్డ.;

బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిం దే. స్టార్ హీరోగా ఎదగలేదు. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి నటులకు పోటీ స్థానంలో అభిషేక్ లేడు? అన్నది వాస్తవం. కానీ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించు కున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు చేసాడు. తండ్రి లెగస్సీని కొనసాగించడానికి తన ఫరిది మేర ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అభిషేక్ బచ్చన్ హీరో అయిన కొత్తలో ఆయన ముందు అమితాబచ్చన్-జయాబచ్చన్ లా గారాల బిడ్డ. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాట ఇండస్ట్రీలో వినరి వారు ఎవరుంటారు. అందరూ వింటారనుకుంటాం. కానీ బాలీవుడ్ లో వ్యక్తిగతంతా అభిషేక్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నాడు? అన్నది తాజాగా రివీల్ చేసాడు. `కొందరు నిర్మాతల నుంచి నాకు ఫోన్లు వచ్చేవి. కానీ, ఆరు నెలల తర్వాత నా సినిమాలు సరిగ్గా ఆడకపోతే వాళ్లు నా ఫోన్లు కూడా ఎత్తేవారు కాదు.
తిరిగి ఫోన్ చేస్తే లిప్ట్ చేసేవారు కాదు. దీన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. లోకం తీరే అలా ఉంది. మీకు విలువ ఉంటే, వారే మిమ్మల్ని పిలుస్తారన్నారు. సినిమాలు సరిగ్గా ఆడకపోవడంలో చాలా సినిమా అవకాశాలు కోల్పోయానన్నారు. సినిమా అనేది పూర్తిగా వ్యాపారం. రాబడి గురించే ఎరవైనా ఆలోచిస్తారు. ఓ నటుడిని ఎంపిక చేసే ముందు అతడి మీద నిర్మాత ఎంత పెడుతున్నాడు? సినిమా ద్వారా ఎంత వస్తుందనే అంచనా వేసుకునే పిలుపిస్తారు.
నమ్మకం ఉంటేనే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. లేదంటే నిర్మొహ మాటంగా దర్శకుడికి ఆ విషయం చెప్పేస్తారు. దర్శక , నిర్మాతల ప్రమాణాలను అందుకోలేకపోతే వారికి అవకాశం ఉండదు. అందుకే కొత్తగా పరిశ్రమకు వచ్చే వారు ఎన్నో విషయాలు ఆలోచించుకుంటారు. కొందరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మరికొంత మంది రావాలని ఉన్నా? పరిస్థితులు వెనక్కి లాగుతుంటాయన్నారు.