అభిరామ్ కి `స్పిరిట్` లో ఛాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా త్రిప్తీ డిమ్రీ ఎంపికైంది. విలన్ గా దక్షిణ కొరియా నటుడు డాంగ్ సియోక్ ఎంపికయ్యాడు. ప్రభాస్ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. సందీప్ సినిమాలో హీరో పోలీస్ పాత్ర అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా అతడి హీరోలు సిస్టమ్ ని చేతుల్లోకి ఈజీగా తీసుకుంటారు.
అలాంటి హీరో చేతుల్లోనే సిస్టమ్ ఉంటే ఆ పాత్ర ఇంకే రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. `స్పిరిట్` కి ఇదే ఎంతో ప్రత్యేకమైనది. ఇంకా సినిమాలో చాలా ప్రధాన పాత్రలు కనిపించనున్నాయి. అయితే ఓ కీలక పాత్రకు దగ్గుబాటి అభిరామ్ ని ఎంపిక చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇందులో అభిరామ్ పాత్ర అతడి రియల్ లైఫ్ కి ఎంతో దగ్గరగా ఉంటుందిట. అభిరామ్ యారోగెంట్ గా ఉంటాడనే ప్రచారం ఉంది.
అతడిలో ఆ యారోగెన్నీ నచ్చే సందీప్ అవకాశం ఇచ్చాడని పరిశ్రమ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఆ పాత్రలో చాలా యాటిట్యూడ్ ఉంటుందని...దాన్ని ఎంతో స్టైలిష్ గా సందీప్ డిజైన్ చేసినట్లు మాట్లాడుకుం టున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమేంటో తేలాలి. ఒకవేళ అభిరామ్ కి అవకాశం నిజమే అయితే గనుక అతడి కెరీర్ టర్నింగ్ ఛాన్స్ అవుతుంది. తేజ సినిమా `అహింస` తో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత అభిరామ్ మళ్లీ మరో సినిమా ప్రకటించలేదు. రానా నిర్మాతగా బిజీ అయ్యాడు గానీ అభిరామ్ మాత్రం అడ్రస్ లేడు. ఈ క్రమంలోనే ప్రేమించిన అమ్మాయితో వివాహం కూడా అయింది.
తాజాగా `స్పిరిట్` లో అవకాశం అంటూ అభిరామ్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. `స్పిరిట్` సినిమాలో అవకాశం కోసం చాలా మంది నటులు ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు అయితే ఏకంగా అవకాశం ఉంటే తనకు ఓ ఛాన్స్ ఇవ్వండని ఓ లేఖ కూడా రాసాడు. ఇది బయటకు వచ్చిన లెటర్. ఇలా బయటకు రాని లేఖలు ఇంకెన్ని ఉంటాయో? ఇంత టఫ్ కాంపిటీషన్ నడుమ అభిరామ్ పేరు తెరపైకి రావడం విశేషం. మరి అవకాశం నిజంగా వచ్చిందా? లేదా? అన్నది తేలాలి.