సల్మాన్ అడుక్కుంటాడు.. పాదాలు నాకేస్తాడు.. డైరెక్టర్ ఫైర్!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో అభినవ్ కశ్యప్ విరోధం ఊహించని మలుపులు తిరుగుతోంది.;
ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్! .. నిప్పుకు పెట్రోల్ తోడైనట్టుగా ఉంది!!. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో అభినవ్ కశ్యప్ విరోధం ఊహించని మలుపులు తిరుగుతోంది. దశాబ్ధాలుగా ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అభినవ్ `దబాంగ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని సల్మాన్ కి అందించాడు. అయినా ఆ తర్వాత దర్శకుడిగా అతడు ఎదగలేకపోయాడు. అయితే దీనికి కారణం సల్మాన్ ఖాన్ అని అతడు పబ్లిగ్గా పదే పదే చెబుతున్నాడు. సల్మాన్ ని నిందిస్తున్నాడు.. తిడుతున్నాడు.. తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. సల్మాన్ పై ఎటాక్ చేస్తున్నాడు. అతడి తీవ్రమైన స్వభావం బయటపడుతూనే ఉంది. అయితే వీటన్నిటికీ సల్మాన్ నుంచి వస్తున్న ప్రతి స్పందన అంతే సింపుల్ గా ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాల్లో చాలామంది అభినవ్ కశ్యప్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. అతడు సల్మాన్ ఖాన్‌ని అసలు నటన రాదు! అని తిట్టేయడం చాలా మందికి నచ్చలేదు.
ఇప్పుడు అభివన్ కశ్యప్ సోదరుడు అనురాగ్ కశ్యప్ దక్షిణాదికి వచ్చి `నిశాంచి` అనే హిట్టు సినిమా తీసాడు. ఈ సినిమాపై సల్మాన్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించగా, దీనిని అస్సలు సహించలేకపోతున్నాడు అభినవ్ కశ్యప్. `తేరే నామ్` సినిమా కోసం పని చేసిన తన సోదరుడు అనురాగ్ కశ్యప్ తో సల్మాన్ విభేధాలను ప్రస్థావిస్తూ.. ప్రాజెక్ట్ నుంచి అనురాగ్ తప్పుకునేలా చేసాడు! అంటూ సల్మాన్ విరుచుకుపడ్డాడు. సల్మాన్ ముఖస్తుతి చెంచాగిరి చేస్తాడని ఆరోపించాడు. తన(అభినవ్)ను సైలెంట్ చేసేందుకు ఇలా చేస్తున్నాడని విమర్శించాడు.
అసలింతకీ సల్మాన్ ఏమని ప్రశంసించాడు? అంట... `నిశాంచి` సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు @వేదికాపింటో @ఆశిష్ థాకరే@ అనురాగ్ కశ్యప్@ సోనాక్షి అంటూ సల్మాన్ ప్రశంసా పూర్వకంగా రాశాడు. కానీ దీనిని అభినవ్ తప్పు పడుతున్నాడు. సల్మాన్ తీరుపై విరుచుకుపడ్డాడు.
సల్మాన్ అనురాగ్‌ను ఇబ్బంది పెట్టారని, తేరే నామ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. సల్మాన్ కు ఒకప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయిన వ్యక్తులను ప్రశంసించడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఇది సల్మాన్ విధి రాత. ఇప్పుడు అతడు పాదాలను నాకేస్తాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు అభినవ్.
నేను ఒక ఇంటర్వ్యూలో అతడిని గూండా అని కామెంట్ చేసాను.. కాబట్టి మాకు గొప్ప అభిమాని అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు.. అనురాగ్ ని సల్మాన్ ప్రశంసిస్తున్నట్టు కనిపిస్తాడు. అవసరమైతే మోకాళ్లపై ఉంటాడు.. అడుక్కుంటాడు కూడా.. అని అభినవ్ బాలీవుడ్ తికానాతో ఇంటర్వ్యూలో దూషించారు. నిశాంచిని ప్రశంసించి ఇక అనురాగ్ ఎలాంటి ప్రకటనలు చేయకూడదని ఒప్పించేస్తాడని సల్మాన్ ని విమర్శించాడు. నేను మౌనంగా ఉండాలని అతడు అలా చేస్తాడు.. ముఖస్తుతి.. చెంచాగిరి ఇది! అని విమర్శించాడు.