• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : బ్లాక్...

బిగ్ బాస్ 8 : బ్లాక్ వాళ్లకి.. రెడ్ వీళ్లకి.. వెళ్తూ కూడా ఆట ఆడిన అభయ్..!

| బిగ్ బాస్ సీజన్ 8 నుంచి 3వ వారం అభయ్ నవీన్ ఎలిమినేషన్ జరిగింది.

By - Tupaki Desk
Update: 2024-09-23 04:00 GMT

బిగ్ బాస్ సీజన్ 8 నుంచి 3వ వారం అభయ్ నవీన్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్ లోనే అతనికి హోస్ట్ నాగార్జున రెడ్ కార్డ్ చూపించి హౌస్ నుంచి వెళ్లిపోమని అన్నారు. కానీ మిగతా కంటెస్టెంట్స్ అంతా నాగార్జునని కన్విన్స్ చేసి శాంతింప చేశారు. ఐతే ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్న అభయ్ ఈ వారం పెద్దగా పర్ఫార్మ్ చేసింది కూడా ఏమి లేకపోవడంతో ఆడియన్స్ ఓటింగ్ లో కూడా లీస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. సో అలా పృధ్వి, అభయ్ లలో అభయ్ ని ఎలిమినేట్ చేశారు.

ఈ ఎలిమినేషన్ చూశాక అదేదో శనివారమే అభయ్ ని హౌస్ నుంచి పంపించొచ్చు కదా అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఓటింగ్ ప్రకారం కూడా అభయ్ లీస్ట్ లో ఉన్నాడని వాళ్లకి తెలియదు. ఐతే వెళ్తూ వెళ్తూ అభయ్ ని 3 బ్లాక్, 3 రెడ్ రోజ్ లను హౌస్ మెట్స్ కి ఇవ్వమని అనగా బ్లాక్ రోజ్ లను మణికంఠ, విష్ణు ప్రియ, పృధ్వి లకు ఇచ్చాడు. రెడ్ రోజ్ లను నిఖిల్, సీతతో పాటుగా 3వ రోజ్ ని నబీల్, సోనియాలకు షేర్ చేశాడు. నిఖిల్ తో 3 వారాల్లోనే ఎన్నో ఏళ్ల ఫ్రెండ్ షిప్ బిల్డ్ అయ్యిందని అభయ్ అన్నాడు.

సీత బయట నీకో అన్న ఉన్నాడు. నెక్స్ట్ రాఖీకి రాఖీ కట్టాలని అన్నాడు అభయ్. అభయ్ ఎలిమినేషన్ హౌస్ మేట్స్ ని కాస్త డిస్టర్బ్ చేసింది. ఐతే అతని నోటి దురుసు తనమే అతని ఆటని మధ్యలో ఆపేసిందని అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వీకెండ్ కొత్తగా మరో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. ఈసారి విచిత్రంగా ఆల్రెడీ ఇదివరకు సీజన్లలో ఉన్న వారినే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తెస్తున్నట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు విన్నర్స్ కాకుండా ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తెస్తారని టాక్. అదే జరిగితే కొత్త కంటెస్టెంట్స్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ జరుగుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 ని అన్ని సీజన్ల కంటే సక్సెస్ చేయాలని బిగ్ బాస్ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. హోస్ట్ నాగార్జున కూడా ఈసారి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రశ్నలు అడగడం షోని మరింత ఆసక్తికరంగా మార్చింది.

Tags:    
  • Abhaynaveen 
  • biggboss8 
  • biggboss 
  • biggbosscontestants 
  • biggbossabhaynaveen 
  • Nagarjunaakkineni 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS