• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రీల్' గెటప్ లో అబ్బవరం.....

'రీల్' గెటప్ లో అబ్బవరం.. క్రేజీ ప్రమోషన్స్

| ఇప్పుడు 'క' సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-26 12:32 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ యంగ్ హీరోకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన నేచురల్ యాక్టింగ్ తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా పరిచయమైన ఆయన.. ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే వంటి పలు చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించారు. మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు 'క' సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.


తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీతో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కిరణ్ అబ్బవరం. 1970స్‌ బ్యాక్ డ్రాప్, ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంతో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఆ సినిమాతో అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలోకి రానున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సినిమాపై ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. కిరణ్ అబ్బవరం కచ్చితంగా హిట్ కొడతారని అంతా ఫిక్స్ అయిపోయారు.


సినిమాలో వాసుదేవ్ రోల్ లో కిరణ్ అబ్బవరం కనిపించనున్నారని ఇప్పటికే మేకర్స్ పలుమార్లు తెలిపారు. పోస్ట్ మ్యాన్ గా కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ తో అది క్లియర్ గా అర్థమైంది. అయితే మేకర్స్ నేడు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ.. జెట్ స్పీడ్ లో ప్రమోట్ చేస్తున్న మూవీ టీమ్ హైదరాబాద్ లో విలేకర్లతో చిట్ చాట్ ఏర్పాటు చేసింది.


ఆ కార్యక్రమానికి పోస్ట్ మ్యాన్ గెటప్ లో వచ్చి సందడి చేశారు కిరణ్ అబ్బవరం. పోస్ట్ మ్యాన్ యూనిఫామ్ లో సైకిల్ తొక్కుతూ ప్రెస్ మీట్ జరిగిన వేదిక వద్దకు వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు మేకర్స్ షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 'క' మూవీకి కిరణ్ అబ్బవరం వేరే లెవెల్ లో క్రేజీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఆయన ఖాతాలో మంచి హిట్ పడుతుందని అంటున్నారు.

ఇక 'క' సినిమా విషయానికొస్తే.. సుజీత్‌, సందీప్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వహించారు. 'క' తోనే టాలీవుడ్ లోకి డైరెక్టర్లుగా వారిద్దరూ ఎంట్రీ ఇస్తున్నారు. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. మరి తొలి పాన్ ఇండియా మూవీతో కిరణ్ అబ్బవరం ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • KA 
  • KiranAbbavaram 
  • ViralLook 
  • Promotions 
  • PromotionalContent 
  • NayanSarika 
  • TanviRam 
  • Sujith 
  • Sandeep 
  • ChintlaGopalakrishnaReddy 
  • SriChakrasEntertainment 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS