అబ్బాస్, హ్యాప్ రాజ్ తో కంబ్యాక్ ఇవ్వ‌డానికి కార‌ణ‌మిదే

ఒకప్పుడు తన లుక్స్, స్టైల్, రొమాంటిక్ పాత్రలతో యూత్ లో భారీ క్రేజ్ సంపాదించిన అబ్బాస్, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.;

Update: 2026-03-20 14:27 GMT

కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లో కూడా మ్యూజిక్ డైరెక్ర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా హ్యాపీ రాజ్ ఇప్పటికే మంచి బజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు మరింత ప్రత్యేకత ను తీసుకొచ్చింది ఓ కీలక అంశం. సీనియర్ నటుడు అబ్బాస్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తిరిగి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఒకప్పుడు తన లుక్స్, స్టైల్, రొమాంటిక్ పాత్రలతో యూత్ లో భారీ క్రేజ్ సంపాదించిన అబ్బాస్, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఎందుకు ఈ ప్రాజెక్ట్‌నే తన కంబ్యాక్ కోసం ఎంచుకున్నారన్న ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

ఈ ప్రశ్నకు సమాధానం డైరెక్ట‌ర్ మరియా రాజ్ రీసెంట్ గా ఇచ్చిన వివరణతో మరింత క్లారిటీ వచ్చింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, అబ్బాస్ తన కంబ్యాక్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. సరైన కథ దొరికే వరకు వెయిట్ చేయాలని నిర్ణయించుకుని, ఈ సమయంలో అనేక స్క్రిప్ట్‌లు వ‌చ్చినా అవేవీ ఆయనను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాయి.

ఇదే సమయంలో మరియా రాజ్ తన కథను అబ్బాస్‌కు వినిపించే అవ‌కాశం ద‌క్కింది. అబ్బాస్ కు తాను ఆన్‌లైన్ లోనే ఈ క‌థ నెరేషన్ ఇచ్చాన‌ని, కథ ప్రారంభం నుంచే ఆసక్తిగా విన్న అబ్బాస్, చివరికి నెరేషన్ ముగిసే సమయానికి తన నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారని దర్శకుడు తెలిపారు. నా కంబ్యాక్ కోసం ఇలాంటి కథ కోసమే ఎదురుచూస్తున్నాను అని అబ్బాస్ చెప్పడం ఈ ప్రాజెక్ట్‌కు ఆయన ఎంతగా కనెక్ట్ అయ్యారో తెలియజేస్తోంది.

ఈ సినిమాలో అబ్బాస్ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ తెలిపారు. మొత్తానికి సరైన కథ కోసం ఎంతోకాలం వేచి చూసిన అబ్బాస్, హ్యాపీ రాజ్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ సిగ్నల్‌గా భావిస్తున్నారు. కథపై నమ్మకం, పాత్రపై నిబద్ధతతో తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కంబ్యాక్‌ను ఎంతవరకు సక్సెస్ చేస్తుందో చూడాలి.



Tags:    

Similar News