ఆవేశం ప్లాన్ మార్చేశారా..?

ఐతే ఆవేశం సినిమా థియేట్రికల్ చూసిన వారు.. థియేట్రికల్ వెర్షన్ మిస్ అయిన వారు ఇలా అందరు కూడా సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశారు

Update: 2024-05-10 07:44 GMT

మలయాళ సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం. జితు మాధవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ మంత్ మలయాళంలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఫాహద్ ఫాజిల్ మరోసారి తన వర్సటైల్ యాక్టింగ్ తో అలరించాడు. గ్యాంగ్ స్టర్ కథతో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అందించవచ్చని ప్రూవ్ చేశారు. ఐతే ఆవేశం సినిమా థియేట్రికల్ చూసిన వారు.. థియేట్రికల్ వెర్షన్ మిస్ అయిన వారు ఇలా అందరు కూడా సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశారు.

రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో ఆవేశం రిలీజైంది. అయితే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. చెప్పాలంటే ఆవేశం తెలుగు వెర్షన్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళ వెర్షన్ ని మాత్రమే అందుబాటులో ఉంచారు మేకర్స్. దీని వెనుక రీజన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

మలయాళంలో హిట్ అయిన ప్రతి సినిమా తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే అక్కడ హిట్ అయిన ప్రేమలు, మంజుమ్మల్ బోయ్స్ సినిమాలు అలానే డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ మంచి సక్సెస్ అందుకున్నాయి. అదే దారిలో ఆవేశం సినిమా కూడా డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసే ప్లాన్ ఏదైనా ఉందని తెలుస్తుంది. లేదా ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసినా చేసే అవకాశం ఉంది.

Read more!

అందుకే తెలుగు వెర్షన్ ఆవేశం ని రిలీజ్ చేయలేదని తెలుస్తుంది. అయితే ఆవేశం ఓటీటీ రిలీజ్ అనగానే సినిమాను తెలుగులో చూడొచ్చని అనుకున్న తెలుగు ఆడియన్స్ కు షాక్ తగిలినట్టు అయ్యింది. ఫాహద్ ఫాజిల్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆవేశం రీమేక్ చేస్తారా లేదా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్ అల్లు అర్జున్ పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. పుష్ప 1 లో ఎస్పీగా చివర్లో అదరగొట్టిన ఫాహద్ పుష్ప 2 లో కూడా ఇంప్రెస్ చేస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News