సంచలన ప్రాంచైజీ టైటిల్ ఛేంజ్!
టైటిల్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;
పాన్ ఇండియాలో `ఆషీకీ` ప్రాంచైజీ అంటే ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. `ఆషీకీ` అంటే యువతలో ఓ ప్రత్యేకమైన క్రేజ్..ఇమేజ్ ఉంది. దర్శక, నిర్మాత మహేష్ బట్ వెలుగులోకి తెచ్చిన మ్యూజికల్ లవ్ స్టోరీ ఆషీకీ అప్పట్లో గొప్ప సంచలన విజయం సాధించిన ప్రేమ కథా చిత్రాల్లో ఒకటి. ఆ సినిమా స్పూర్తితోనే మోహిత్ సూరి అదే టైటిల్ తో `ఆషీకీ -2` తెరకెక్కించి `ఆషీకీ` రేంజ్ ను అంతకంతకు రెట్టింపు చేసాడు. ఆ సినిమాలో నటించిన ఆదిత్యా రాయ్ కపూర్- శ్రద్దా కపూర్ అటుపై నిజ జీవితంలోనూ ప్రేమలో పడిపోయారు. అంతగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సబ్జెక్ట్ అది.
టైటిల్ మార్పు వెనుక కారణం:
`ఆషీకీ` అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయింది. తాజాగా `ఆషీకీ -3` కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్-శ్రీలీల జంటగా అనురాగ్ బసు ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. మార్కెట్ లోకి ఇప్పటికే `ఆషీకీ 3`గా వెళ్లిపోయింది. ఎక్కడా చూసినా `ఆషీకీ 3` టైటిల్ తోనే జనాల్లో నలుగుతోంది. ఆ టైటిల్ చూసే యువత థియేటర్ల వైపు పరుగులు తీస్తుంది. అందులోనూ నేటి జనరేషన్ కి కనెక్ట్ అయ్యే సరైన సబ్జెక్ట్ తో అనురాగ్ బస్ మలుస్తున్నాడు. అయితే ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి `ఆషీకీ-3` కి బధులు గా ` తూమేరీ జిందగీ హై` టైటిల్ తో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.
ఓపెనింగ్స్ పై ప్రభావం తప్పదా:
టైటిల్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్తగా `తూ మేరీ జిందగీ హై` ఏంటి? అంటూ చర్చ జరుగుతుంది. తూ మేరీ జిందగీ హై అంటే తెలుగులో `నువ్వే నా జీవితం` అని అర్దం. కానీ ఈ టైటిల్ ను తెలుగు ఆడియన్స్ కూడా అంగీకరించడం లేదు. ఓ బ్రాండ్ ప్రాంచైజీ టైటిల్ ని ఇలా మార్చడం ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ విమర్శల్ని మేకర్స్ పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
టెక్నికల్ సమస్యలేవైనా కారణమా:
ఏ డైరెక్టర్ అయినా కథని బట్టే టైటిల్ నిర్ణయిస్తారు. మరి `ఆషీకీ -3` టైటిల్ తో రిలీజ్ అన్నది టెక్నికల్ గా ఏవైనా సమస్యలుండి మారుస్తున్నారా? లేక `తూ మేరీ జిందగీ హై` అన్నది మాత్రమే పక్కాగా యాప్ట్ అవుతుందని నిర్ణయిస్తున్నారా? అన్నది చూడాలి. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అంది స్తున్నారు.