పెద్ద హీరో సినిమాకి రిలీజ్ ముందు క‌ష్టాలు

ఆమిర్ ఖాన్ నటించిన 'సీతారే జమీన్ పర్' CBFC కార‌ణంగా రిలీజ్ ముందు ఇబ్బందుల్లో పడింది.;

Update: 2025-06-16 05:21 GMT

ఆమిర్ ఖాన్ నటించిన 'సీతారే జమీన్ పర్' CBFC కార‌ణంగా రిలీజ్ ముందు ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమా విడుదలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకి సూచించిన కట్స్ కి ఆమిర్ ఖాన్ తిరస్కరించడంతో ఈ స‌మ‌స్య త‌లెత్తింది. ఆర్.ఎస్. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. `సీతారే జమీన్ పర్` జూన్ 20న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండ‌గా, చివ‌రి నిమిషంలో ఇబ్బంది త‌లెత్తింద‌ని బాలీవుడ్ మీడియాలు త‌మ క‌థ‌నాల్లో పేర్కొన్నాయి.

సీతారే జమీన్ పర్ సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలున్నాయని సీబీఎఫ్‌సి అభిప్రాయ‌ప‌డింది. సర్టిఫికేషన్ కు ముందు రెండు కట్స్ ని సిఫార్సు చేసింద‌ని స‌మాచారం. కానీ ఈ సినిమాకు తాను ఎటువంటి సవరణలు చేయ‌లేన‌ని అమీర్ ఖాన్ సీబీఎఫ్‌సి పెద్ద‌ల నిబంధ‌న‌ల్ని తిర‌స్క‌రించారు. ఫలితంగా సినిమా సర్టిఫికేషన్ ఆలస్యం అయింది. స‌ర్టిఫికెట్ ఇంకా రాలేదు కాబ‌ట్టి షెడ్యూల్ ప్ర‌కారం ఈ చిత్రం విడుద‌ల‌వుతుందా లేదా? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి.

అయితే ఆ రెండు క‌ట్స్ లేకుండా ఆపేందుకు ఆమీర్ ఖాన్ చాలా ప్ర‌య‌త్నించారు. ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.ప్ర‌స‌న్న‌తో క‌లిసి చాలా జాగ్ర‌త్త‌గా స‌న్నివేశాల్ని మ‌లిచామ‌ని, ద‌య‌చేసి క‌ట్స్ చెప్పొద్ద‌ని సీబీఎఫ్‌సి అధికారుల‌ను ఆమీర్ అభ్య‌ర్థించారు. సందర్భాన్ని బట్టి సన్నివేశాలు, సంభాషణలు అర్థవంతంగా ఉంటాయి. వాటితో ముడిప‌డిన ఎమోష‌న్స్ ప్ర‌భావితం అవుతాయ‌ని ఆమీర్ న‌మ్ముతున్నాడు. అయితే సీబీఎఫ్‌సి ఏ స‌న్నివేశాల‌కు కట్స్ విధించింది అనే వివరాలు వెల్లడించలేదు. 2 గంట‌ల 35 నిమిషాల నిడివి గ‌ల ఈ సినిమాని దాదాపు 3500 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. సీబీఎఫ్‌సి స‌ర్టిఫికేష‌న్ ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తే, అనంత‌రం అడ్వాన్స్ బుకింగులు మొద‌ల‌వుతాయి.

Tags:    

Similar News