రోజుకొక పుల్ బాటిల్...రక్తంతో ప్రేమలేఖ!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకమే. ఇప్పటికే ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మూడవ పెళ్లికి రెడీ అవుతున్నారు. మొదటి భార్య రీనా దత్తా.;
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకమే. ఇప్పటికే ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మూడవ పెళ్లికి రెడీ అవుతున్నారు. మొదటి భార్య రీనా దత్తా. ఆ జంటకు కుమార్తె.. కొడుకు గలరు. కానీ కొంత కాలానికి కాపురంలో కలతలు చోటు చేసుకోవడంతో 16 ఏళ్ల తర్వాత విడి పోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రీనా దత్తా ప్రేమ కోసం అమీర్ ఖాన్ ఎంతగా పరితపించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
అమీర్ ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఏకంగా రక్తంతోనే ప్రేమ లేఖ రాసిన గొప్ప ప్రేమకథగా తెలుస్తుంది. అమీర్ -రీనా దత్తా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆప్రేమను దక్కించుకోవడం కోసం అమీర్ ఖాన్ తన రక్తంతో ప్రేమలేఖ రాసారు. అయినా రీనా దత్తా మనసు అంగీకరించలేదు. కొంత సమయం తీసుకుని అప్పుడు అమీర్ లవ్ ను అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారు.
అమీర్ ఖాన్ మొదటి చిత్రం `ఖయామత్ సే ఖయామత్ తక్` లో చిన్న రోల్ కూడా పోషించింది. అయితే రీనా దత్తా అమీర్ విడిపోయిన తొలి రోజు ఏకంగా ఒక పుల్ బాటిల్ మద్యం సేవించినట్లు అమీర్ తెలిపారు. ఆ తర్వాత ఏడాది పాటు రోజు మద్యం తీసుకునే పనిలోనే ఉన్నారుట. ఆ సమయంలో నిద్ర పోలేదని..నిద్ర కూడా లేకుండా మద్యం తాగినట్లు తెలిపారు.
అధిక మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయిన సందర్భాలెన్నో అన్నారు. ఒక సమయంలో ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందన్నారు. అదే ఏడాది `లగాన్` రిలీజ్ అయింది. సినిమా విజయం సాధించడంతో `మ్యాన్ ఆఫ్ ది ఇయర్` అని కీర్తించినా అదెక్కడా తలెక్కలేదన్నారు. ఆ పిలుపు తనకో వ్యంగ్యంగా అనిపించిందన్నారు. అంతగా రీనా దత్తాని అమీర్ ఖాన్ ప్రేమించారు.