బోల్డ్ స్టెప్ తీసుకోబోతున్న అమీర్ ఖాన్.. పే-పర్-వ్యూ పై అంత నమ్మకం ఏంటి సామీ!
అయితే తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ పే-పర్- వ్యూ అనే ట్రెండ్ గురించి మాట్లాడుతూ.. "నేను చేసిన సితారే జమీన్ పర్ మూవీని యూట్యూబ్లో చూడడం కోసం 100 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.;
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సినిమాల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు.ఇప్పటివరకు ఈయన ఖాతాలో ఉన్న రికార్డుని ఎవరూ చెరపలేకపోయారు కూడా. అలా 'దంగల్' మూవీతో రూ.2000 కోట్ల కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ ని షేక్ చేసిన అమీర్ ఖాన్.. తన సినిమాల విషయంలో అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలా అమీర్ ఖాన్ ఈ ఏడాది నటించిన 'సితారే జమీన్ పర్ ' మూవీని థియేటర్లలో విడుదల చేశాక.. యూట్యూబ్లో విడుదల చేయాలనే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే చాలామంది హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాక ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదలవుతాయి.కానీ సితారే జమీన్ పర్ మూవీని మాత్రం అమీర్ ఖాన్ ఓటీటీ ఫ్లాట్ ఫాం కి కాకుండా యూట్యూబ్లో విడుదల చేసి సక్సెస్ అయ్యారు. ఇక సితారే జమీన్ పర్ మూవీకి కోట్లు ఇవ్వడానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ముందుకి వచ్చినప్పటికీ ఆ పద్ధతిలో పోకుండా సరికొత్త నిర్ణయాన్ని తీసుకొని యూట్యూబ్ లో పే - పర్ - వ్యూ మోడల్ ని ఎంచుకున్నాడు.
అయితే తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ పే-పర్- వ్యూ అనే ట్రెండ్ గురించి మాట్లాడుతూ.. "నేను చేసిన సితారే జమీన్ పర్ మూవీని యూట్యూబ్లో చూడడం కోసం 100 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఒక యూజర్ ఈ సినిమాకి 100 రూపాయలు పెట్టి సినిమా చూడడం ప్రారంభిస్తే.. 48 గంటల వరకు యూట్యూబ్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. 48 గంటలు ముగిశాక ఈ సినిమాని చూడాలంటే మళ్ళీ డబ్బులు చెల్లించాల్సిందే.. అయితే పే-పర్- వ్యూ మోడల్ అనేది ఇప్పుడు జనాల్లోకి ఎక్కువగా వెళ్లకపోయినప్పటికీ.. మెల్లిమెల్లిగా ఈ ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. దీనివల్ల మనం ఎక్కువగా డబ్బులు ఆశించలేము..
అయితే పే-పర్-వ్యూ మోడల్ ని ఓ సినిమా కోసం ఎంచుకుంటే.. ఆ సినిమా ఉదాహరణకు X మొత్తాన్ని వసూలు చేస్తే.. మనం 20X వసూలు చేస్తున్నాం. ఇది ఒక మంచి విషయమే అయినప్పటికీ ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా సంపాదించే సంప్రదాయ మార్గంతో పోల్చినట్లయితే మనం ఎక్కువ ఆదాయాన్ని సంపాదించలేము.. కానీ పే - పర్ - వ్యూ మోడల్ ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుంది.. కానీ ఈ మోడల్ ఓటిటి ప్లాట్ఫారంలో అందించినంత వేగంగా డబ్బును అందించలేదు.. పే-పర్-వ్యూ మోడల్ ద్వారా ఒక సినిమాని.. అందులో ఉండే కంటెంట్ అలాగే స్టార్ విలువను బట్టి యూట్యూబ్లో X మొత్తానికి అమ్ముడు అవుతాయి. కానీ ఈ పే-పర్- వ్యూ మోడల్ లో ఒకేసారి ఎక్కువ డబ్బు రాదు. ఇది ఎక్కువ రోజులు పని చేసే నెమ్మది గల ప్రక్రియ..
అలాగే ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా వచ్చే ఒత్తిడి లాంటి పరిస్థితులకు లొంగిపోకుండా ఈ యూట్యూబ్ ద్వారా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ సంపాదించుకోవాలనేదే నా ఉద్దేశం. అందుకే నేను ఈ పే-పర్-వ్యూ మోడల్ ని ఎంచుకున్నాను" అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.. అయితే అమీర్ ఖాన్ ఈ పద్ధతిని ఎంచుకోవడానికి కారణం గతంలో ఆయన సినిమాల హక్కులను ఓటీటీకి అమ్మాక సినిమా విషయంలో పూర్తిగా స్వేచ్ఛ కోల్పోతాడు. అందుకోసమే ఇలా ఆదాయం అనేది ఎక్కువ రోజులకు వచ్చినా చాలు కానీ స్థిరమైన ఆదాయాన్ని సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ ఆలోచన తీసుకున్నట్టు తెలుస్తోంది.