సూపర్‌ స్టార్‌ చాదస్తంకు విసిగి పోయిన దర్శకుడు..!

తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దీపక్ తిజోరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం విషయాన్ని ఇప్పుడు ప్రస్థావించడంతో చర్చనీయాంశం అయింది.;

Update: 2025-07-13 15:30 GMT

సినిమా ఇండస్ట్రీలో హీరో, దర్శకుడి మధ్య విభేదాలు అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. సినిమా మేకింగ్‌ విషయంలో హీరోల ఇన్వాల్వ్‌మెంట్‌ ఉన్నప్పుడు ఖచ్చితంగా విభేదాలు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హీరోలు సోషల్‌ మీడియా, ఇతర మీడియా సంస్థల్లో వైరల్ అవుతామేమో అనే ఉద్దేశంతో దర్శకులతో విభేదాలు పెట్టుకోవడంలేదు. కొందరు స్టార్‌ హీరోలు మాత్రం తాము చెప్పింది జరిగేలా దర్శకుల మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఏదో ఒక సమయంలో ఆయా దర్శకులు సోషల్‌ మీడియా ద్వారా హీరోల యొక్క అత్యుత్సాహం గురించి, హీరోలు స్క్రీన్‌ప్లేలో వేలు పెట్టడం వంటి వాటి గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం.

తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దీపక్ తిజోరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం విషయాన్ని ఇప్పుడు ప్రస్థావించడంతో చర్చనీయాంశం అయింది. ఆమీర్‌ ఖాన్‌ హీరోగా మహేష్ భట్‌ దర్శకత్వంలో 'గులాం' అనే సినిమా ప్రారంభం అయింది. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఆమీర్‌ ఖాన్‌ ఏదో ఒక విషయం గురించి పదే పదే చర్చించడం, పర్‌ఫెక్షన్‌ పేరుతో మళ్లీ మళ్లీ షూట్‌కి వెళ్లడం, స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేయడం వంటివి చేశాడట. దాంతో మహేష్‌ భట్‌కి చాలా కోపం వచ్చిందట. దాంతో ఆమీర్‌ ఖాన్‌ పై కోపంతో ఆ సినిమా నుంచి మహేష్ భట్‌ తప్పుకున్నాడు అంటూ దీపక్‌ తిజోరి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆమీర్‌ ఖాన్‌ తన కెరీర్‌ ఆరంభం నుంచే సినిమాల మేకింగ్‌లో ఇన్వాల్వ్‌ అవుతాడు అనే పేరు ఉంది. ఆయన కథ విషయంలో స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడికి సలహాలు ఇస్తాడనే టాక్‌ ఉంది. ఆయన సలహాలను కొందరు దర్శకులు తీసుకుని హిట్‌ కొడితే, కొందరు దర్శకులు ఆ సలహాల వల్ల ఫ్లాప్‌ అయ్యాం అంటూ ఉండేవారు. గత దశాబ్ద కాలంగా ఆమీర్‌ ఖాన్‌ కి సక్సెస్‌లు అనేవి లేవు. దాంతో ఆయన ఇప్పుడు తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా అప్పటి విషయాలను తీసుకు వచ్చి ఆయన స్థాయిని తగ్గించడం తప్ప మరేంటి అంటూ కొందరు ఆమీర్‌ ఖాన్‌ అభిమానులు దీపక్‌ తిజోరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్‌ భట్‌ 'గులాం' సినిమాను వదిలేసి వెళ్లడంతో విక్రమ్‌ భట్‌ దర్శకత్వంలో సినిమా పూర్తి చేశారు. ఆమీర్‌ ఖాన్‌ హీరోగా రాణి ముఖర్జీ హీరోయిన్‌గా ఈ సినిమా రూపొందింది. 1998 జూన్‌ 19న విడుదలైన గులాం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దర్శకుడి మార్పు గురించి పెద్దగా చర్చ జరగలేదు. అంతే కాకుండా ఆమీర్‌ ఖాన్‌ చెప్పినట్లుగానే కథ, స్క్రీన్‌ప్లేను నడిపించారు. అందుకే ఆ సినిమా నుంచి ఆమీర్‌ ఖాన్‌ తన చాలా సినిమాల కథ విషయంలో సలహాలు ఇవ్వడం చేస్తూ ఉండేవాడట. 44వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌లో గులామ్‌ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డ్‌ దక్కింది. అంతే కాకుండా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 6 నామినేషన్‌లను అందుకుంది.

Tags:    

Similar News