చాలా ఏళ్లు ఆ ఆలోచనకు దూరంగానే ఉన్నా
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మూడోసారి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. బెంగుళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ తో ఆయన కొన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్నాడు.;
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మూడోసారి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. బెంగుళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ తో ఆయన కొన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆమిర్ 60వ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గౌరీతో తన బంధాన్ని స్వయంగా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి గౌరీతో తన బంధం గురించి ఆమిర్ మాట్లాడాడు.
ప్రేమలో పడాలనే ఆలోచనకు తాను చాలా ఏళ్ల పాటూ దూరంగా ఉన్నట్టు చెప్పిన ఆమిర్.. తాను, గౌరీ అనుకోకుండా కలిసి ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యామని, కొన్నేళ్ల తర్వాత తమ మధ్య ప్రేమ పుట్టిందని, ఇప్పుడు తమ మధ్య నిజమైన ప్రేమ మాత్రమే ఉందని, తామిద్దరూ భార్యాభార్తలు కాకపోయినా ఎప్పటికీ ఫ్యామిలీగానే ఉంటామని ఈ సందర్భంగా ఆమిర్ వెల్లడించాడు.
గౌరీని కలవడానికి ముందు తాను థెరపీ చేయించుకున్నానని, ఆ థెరపీ తర్వాతే తనను తాను ప్రేమించుకోవడంతో పాటూ తన హెల్త్ పై ఫోకస్ చేశానని, ఆ టైమ్ లో తన ఫ్రెండ్స్ కూడా ప్రతీ విషయంలో తనకు మద్దుతుగా నిలిచారని, పిల్లలు, పేరెంట్స్ తో రోజంతా స్పెండ్ చేస్తే చాలు, మరొక లైఫ్ పార్టనర్ అవసరం లేదని భావించానని ఆమిర్ ఆన్నాడు.
గత ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ లో ఉన్నట్టు చెప్తూ గౌరీని మీడియాకు పరిచయం చేశాడు ఆమిర్. కాగా వీరిద్దరి మధ్య 25 ఏళ్ల నుంచి మంచి బాండింగ్ ఉంది. ప్రస్తుతం గౌరీ ఆమిర్ నిర్మాణ సంస్థలో వర్క్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ గతంలో కిరణ్ రావు ను పెళ్లి చేసుకున్నారు. 16 ఏళ్ల పాటూ కలిసే ఉన్న వీరు, 2021లో విడాకులు తీసుకున్నారు. కిరణ్ రావు కంటే ముందు ఆమిర్ రీనా దత్తాను పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు.
ఇక సినిమాల విషయానికొస్తే ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమిర్ పాల్గొంటున్నాడు. జూన్ 20 తర్వాత నుంచి తన డ్రీమ్ ప్రాజెక్టు మహా భారతం వర్క్స్ ను వేగవంతం చేయనున్నట్టు ఆమిర్ తెలిపాడు. మహా భారతాన్ని నెక్ట్స్ లెవెల్ లో తీసి ఆడియన్స్ ను థ్రిల్ చేయాలని ఆమిర్ ప్లాన్ చేస్తున్నాడు.