స్నేహితురాలిని వీడి ఉండలేనంటున్న 60 ఏజ్ స్టార్
అక్కడ ఫోటోగ్రాఫర్ల సందడి నడుమ కూడా అతడు మూడో సతి చేతిని విడిచిపెట్టలేదు. ఆసక్తికరంగా గౌరీ స్ప్రాట్ కుమారుడు కూడా అమీర్ చెంతనే ఎంతగానో కలిసిపోయి కనిపించాడు.;
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ భార్యను వదిలి క్షణమైనా ఉండలేకపోతున్నాడు. 60 వయసులో అతడు మూడో వివాహానికి సిద్ధమవ్వడమే కాదు.. అతడు తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ని క్షణమైనా వదిలి ఉండలేని స్థితిలో `సీతారే జమీన్ పార్` ప్రీమియర్ కి అటెండయ్యాడు. అక్కడ ఫోటోగ్రాఫర్ల సందడి నడుమ కూడా అతడు మూడో సతి చేతిని విడిచిపెట్టలేదు. ఆసక్తికరంగా గౌరీ స్ప్రాట్ కుమారుడు కూడా అమీర్ చెంతనే ఎంతగానో కలిసిపోయి కనిపించాడు.
అమీర్ నిస్సందేహంగా ప్రయోగానికి వెనకాడడని `సీతారే జమీన్ పార్` నిరూపిస్తోంది. అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆరంభ వసూళ్లు లేకపోవడం నిరాశపరిచింది. మొదటిరోజు ఈ చిత్రానికి 20 కోట్ల వరకూ గ్రాస్ ని ఆశిస్తే కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డీసెంట్ రివ్యూలు వచ్చినా ఈ పరిస్థితిని అమీర్ ఊహించి ఉండడు.
అమీర్ చాలా భయపడినట్టు, ఓటీటీలకు సినిమాల్ని అమ్ముకుంటున్న ఈ యుగంలో థియేటర్లు ప్రధానమైన ఎంటర్ టైన్ మెంట్ ఆప్షన్ కాదని నిరూపణ అవుతోంది. సీతారే జమీన్ పర్ ఎలా ఉందో చూసేందుకు కనీసం మొదటి మూడు రోజులు అయినా జనం థియేటర్లకు వచ్చేవారు. కానీ ఇలాంటి మిడ్ బడ్జెట్ సినిమాలను ఓటీటీల్లో చూసేందుకే ప్రజలు ఆసక్తిగా ఉన్నారని నిరూపణ అయింది. ఇక అమీర్ భయపడాల్సిన పని లేదు. ఓటీటీలకు సూట్ కాని, కేవలం థియేటర్లకు మాత్రమే పనికొచ్చే సినిమాల్లో నటించడం ఒక్కటే అతడి ముందు ఉన్న విధి.