బ‌జ్ కోసం ఆమిర్ భ‌లే స్కెచ్ వేశాడే!

చాలా కాలం త‌ర్వాత బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా వ‌స్తోన్న సినిమా సితారే జ‌మీన్ ప‌ర్. లాల్ సింగ్ చ‌డ్డా త‌ర్వాత ఆమిర్ హీరోగా మ‌రో సినిమా రాలేదు.;

Update: 2025-06-19 09:30 GMT

చాలా కాలం త‌ర్వాత బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా వ‌స్తోన్న సినిమా సితారే జ‌మీన్ ప‌ర్. లాల్ సింగ్ చ‌డ్డా త‌ర్వాత ఆమిర్ హీరోగా మ‌రో సినిమా రాలేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నాళ్లకు సితారే జ‌మీన్ ప‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు ఆమిర్. ఒక‌ప్పుడు ఆమిర్ నుంచి సినిమా వ‌స్తుందంటే బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆయ‌న నుంచి వ‌స్తున్న సినిమాకు ఊహించిన బ‌జ్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం.

మేక‌ర్స్ సినిమాపై ఎంత బ‌జ్ క్రియేట్ చేద్దామ‌ని ట్రై చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేయ‌డానికి మ‌రో ప్లాన్ వేసింది. ఆమిర్ ఖాన్ బ్యాన‌ర్ లో త‌న కొడుకు జునైద్ ఖాన్ న‌టిస్తున్న సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను సితారే జ‌మీన్ ప‌ర్ సినిమాకు జ‌త చేసి ఫ్యాన్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌ని ఆమిర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ల‌వ్‌యాపా సినిమా ఫ్లాప్ త‌ర్వాత కొడుకు కెరీర్ బాధ్య‌త‌ను త‌న భుజాల‌పై వేసుకున్నాడు ఆమిర్. అందులో భాగంగానే సునీల్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో జునైద్ హీరోగా, సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా ఏక్ దిన్ అనే సినిమాను త‌న సొంత బ్యాన‌ర్ లోనే నిర్మిస్తున్నాడు. కొరియ‌న్ మూవీ వ‌న్ డే సినిమాకు హిందీ రీమేక్ గా ఏక్ దిన్ తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే.

రొమాంటిక్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ సినిమా జ‌పాన్, ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంది. అయితే ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి లాంటి పాన్ ఇండియ‌న్ స్టార్ ఉన్న‌ప్ప‌టికీ ఆడియ‌న్స్ కు ఏక్ దిన్ పై న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు. రీమేక్ సినిమాల‌పై ఆమిర్ కు ఉన్న ప్రేమ అత‌ని కొడుకు కెరీర్ ను కూడా నాశ‌నం చేస్తుందేమో అని ఫ్యాన్స్ బాధ ప‌డుతున్నారు. అయితే సితారే జ‌మీన్ ప‌ర్ కు ఏక్ దిన్ టీజ‌ర్ ను జ‌త చేస్తున్నార‌నే వార్త వినిపిస్తున్న‌ప్ప‌టికీ ఆమిర్ సినిమా బుకింగ్స్ పై అది ఎలాంటి ప్ర‌భావం చూపించ‌డం లేదు. సితారే జ‌మీన్ మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆమిర్ కు ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి మ‌రి.

Tags:    

Similar News