జ్వాలా గుత్తా బిడ్డకు నామకరణం అమీర్ చేతుల మీదుగా..!
పెళ్లయిన నాలుగేళ్లకు జ్వాలా గుత్తా- విష్ణువిశాల్ జంట తమ మొటి శిషువుకు జన్మనిచ్చారు. ఏప్రిల్ 22న ఒక ఆడ బిడ్డను స్వాగతించామని ఈ జంట అధికారికంగా ప్రకటించింది.;

పెళ్లయిన నాలుగేళ్లకు జ్వాలా గుత్తా- విష్ణువిశాల్ జంట తమ మొటి శిషువుకు జన్మనిచ్చారు. ఏప్రిల్ 22న ఒక ఆడ బిడ్డను స్వాగతించామని ఈ జంట అధికారికంగా ప్రకటించింది. వారి కుమార్తెకు ఈరోజు పేరు పెట్టారు. నామకరణ కార్యక్రమానికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హాజరయ్యారు. అమీర్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ ముంబై నుంచి హైదరాబాద్‌కు రావడమే గాక, జ్వాలా గుత్తా బిడ్డను తన చేతిలోకి తీసుకుని స్వయంగా నామకరణం చేసారు. పాప పేరు- మీరా. ఈ ఆనంద క్షణాన జ్వాలా - విష్ణు వేడుక నుండి కిడ్ ఫోటోలను, ఈవెంట్ ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసారు.

ఈ ఆనంద క్షణాన జ్వాలా గుత్తా ఎమోషన్ కి గురయ్యారు. ``మా మీరా! ఇంతకంటే ఎక్కువ అడగలేకపోయాను!! నువ్వు లేకుండా ఈ ప్రయాణం అసాధ్యం!! మేము నిన్ను ప్రేమిస్తున్నాము. అందమైన ఆలోచనాత్మక నామకరణానికి ధన్యవాదాలు`` అని జ్వాలా సోషల్ మీడియాల్లో రాసారు. మీరా నామకరణ కార్యక్రమానికి విచ్చేసిన అమీర్ ఖాన్ సర్ కు పెద్ద కౌగిలింత... మీ ప్రేమకు ధన్యవాదాలు.. ఆమీర్ సర్‌తో ప్రయాణం ఒక మాయాజాలం...`` అని విష్ణు తన క్యాప్షన్‌లో రాశారు.
టెన్నిస్ స్టార్ జ్వాలాగుత్తాను తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2021లో ఈ జంటకు వివాహం అయింది. పెళ్లికి ముందు దాదాపు రెండు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నారు. కెరీర్ పరంగా చూస్తే, రజనీకాంత్ `లాల్ సలామ్` చిత్రంలో చివరిసారిగా కనిపించిన విష్ణు విశాల్ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నెలలో `ఓహో ఎంతన్ బేబీ`లో ఆయన కనిపించనున్నారు. ఇరందు వానం, మోహన్‌దాస్, ఆర్యన్ సినిమాలు కూడా రూపొందుతున్నాయి.
సీతారే జమీన్ పార్ తర్వాత రజనీ కాంత్ కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.