హీరో ఆదికి మరో శుభవార్త.. రెట్టింపైన ఆనందం..!
కొంతమంది మాత్రమే పదికిపైగా ఫ్లాపులు వచ్చినా కూడా నిలదొక్కుకుని, ఆ తర్వాత ఒక సూపర్ హిట్‌తో మళ్లీ స్టార్ కెరీర్‌ను మొదలు పెట్టిన వారు ఉన్నారు.;
Aadi Saikumar Family:
వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ కెరీర్ నాశనం చేసుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది మాత్రమే పదికిపైగా ఫ్లాపులు వచ్చినా కూడా నిలదొక్కుకుని, ఆ తర్వాత ఒక సూపర్ హిట్‌తో మళ్లీ స్టార్ కెరీర్‌ను మొదలు పెట్టిన వారు ఉన్నారు. ఇలాంటి వారి కృషిని నిజంగానే మెచ్చుకోకుండా ఉండలేం. కింద పడిన ప్రతిసారి పైకి లేచి, మళ్లీ తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అలాంటి హీరోలలో ఒకరు ఆది సాయికుమార్.
Aadi Saikumar Becomes Father:
వరుసగా పదికిపైగా ఫ్లాపులు వచ్చినా కూడా తన స్వయంకృషిని నమ్ముకుంటూ ముందుకెళ్లారు హీరో ఆది సాయికుమార్. కెరీర్ ప్రారంభంలో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది, ఆ తర్వాత సరైన విజయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుస పరాజయాల వల్ల మార్కెట్ తగ్గిపోయి, థియేటర్లలో సినిమా విడుదల కావడమే కష్టమైన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు ఎక్కువగా ఓటీటీలకే పరిమితమయ్యాయి.
అలాంటి సమయంలో ఆది నటించిన శంబాల సినిమా అతడి జీవితంలో కీలక మలుపు తీసుకొచ్చింది. క్రిస్మస్ వీకెండ్‌లో విడుదలైన ఈ సినిమా మొదటి నుంచే మంచి అంచనాలు రేపింది. ట్రైలర్, ప్రోమోలు చూసిన ప్రేక్షకులకు ఇది విషయం ఉన్న సినిమా అనే భావన కలిగింది. రిలీజ్ తర్వాత కూడా కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించింది. గట్టి పోటీ మధ్య కూడా నిలబడి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దాదాపు రూ.20 కోట్లకు చేరువగా వసూళ్లు రావడం విశేషం.
ఈ విజయం ఆది ఒక్కరికే కాదు, ఆయన కుటుంబానికి కూడా పెద్ద ఆనందాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆయన తండ్రి సాయికుమార్ ఎంతో సంతోషంగా కనిపించారు. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో సాయికుమార్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ చిరునవ్వులతో దర్శనమిచ్చారు. అంతేకాకుండా ఒక ఈవెంట్‌లో సాయికుమార్, ఆది భార్యతో “ఇన్నేళ్ల నీ కల నిజమైంది కదా” అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చారు.
ఇక ఈ సంతోషాన్ని రెట్టింపు చేసే మరో శుభవార్త కూడా ఆది ఇంట్లో చోటు చేసుకుంది. ఆది రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆది దంపతులకు అయానా అనే కూతురు ఉంది. ఇప్పుడు కొడుకు రావడంతో కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది.
ఈ విషయాన్ని ఆది సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఒకవైపు సినిమా సూపర్ హిట్ కావడం, మరోవైపు కొడుకు పుట్టడం—ఈ రెండూ కలసి ఆది ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. అభిమానులు, ఇండస్ట్రీ మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆది జీవితంలో ఇది నిజంగా గోల్డెన్ ఫేజ్ అని చెప్పాలి.