మ‌రింత క్లారిటీగా చుట్ట‌మల్లే సాంగ్

ప్ర‌స్తుత రోజుల్లో ఎక్కువ సాంగ్స్ 4కె లోనే ఎక్కువ ఉంటుండ‌గా, ఇప్పుడు వాటిని 8కె లో రిలీజ్ చేస్తున్నారు.;

Update: 2025-06-13 20:30 GMT

ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ కు మంచి డిమాండ్ ఉంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మొద‌టిగా జ‌న‌తా గ్యారేజ్ సినిమా రాగా ఆ సినిమా అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఆ సినిమా హిట్ అవ‌డంతో వీరిద్ద‌రి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందా అని అంద‌రూ ఎదురుచూశారు. అందులో భాగంగానే చాలా ఏళ్ల‌కు మళ్లీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో దేవ‌ర సినిమా రావ‌డం అంద‌రినీ మ‌రింత ఆనందింపచేసింది.

అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచ‌నాల‌ను మూట గ‌ట్టుకున్న దేవ‌ర సినిమా ఒక్కో అనౌన్స్‌మెంట్ తో ఆ అంచ‌నాల‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది. భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో దివంగ‌త న‌టి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది.

దేవ‌ర సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ క‌లిసి చేసిన చుట్టుమ‌ల్లే సాంగ్ కు ఓ స‌ప‌రేట్ ఫ్యాన్ బేసే ఉంది. యాక్ష‌న్ మూవీలో వ‌చ్చిన ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే తాజాగా చుట్టమ‌ల్లే సాంగ్ ను 8కె వెర్ష‌న్ లో రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో పాట‌లు 8కె రిలీజై ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోగా తాజాగా చుట్ట‌మ‌ల్లే సాంగ్ రిలీజైంది.

ప్ర‌స్తుత రోజుల్లో ఎక్కువ సాంగ్స్ 4కె లోనే ఎక్కువ ఉంటుండ‌గా, ఇప్పుడు వాటిని 8కె లో రిలీజ్ చేస్తున్నారు. 8కె వీడియో 4కె కంటే ఎక్కువ రెజ‌ల్యూష‌న్ క్వాలిటీతో ఉంటుంది. 8కె వీడియోలో మంచి క్లారిటీ విజువ‌ల్స్ చూసే అవ‌కాశ‌ముంది. ఆల్రెడీ ద‌స‌రా, గేమ్ ఛేంజ‌ర్, రైడ్2, స్త్రీ లాంటి సినిమాల నుంచి కూడా కొత్త‌గా 8కె వెర్ష‌న్ ను మేక‌ర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

Full View
Full View
Full View
Full View
Full View
Full View
Full View
Full View
Tags:    

Similar News