గట్టి పోటీ.. ఈసారి బన్నీకా? కొత్త వారికా?

72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల అనౌన్స్మెంట్ పై ఇప్పుడు సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి దక్కుతుందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

Update: 2026-07-03 09:30 GMT

72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల అనౌన్స్మెంట్ పై ఇప్పుడు సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి దక్కుతుందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే ఒకసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మరోసారి అదే ఘనతను అందుకుంటారా? లేక కొత్త నటుడు ఆ అవార్డును సొంతం చేసుకుంటారా? అన్నది ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో ప్రకటించనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2024లో విడుదలైన సినిమాలకు సంబంధించినవి.

ఇందులో బెస్ట్ యాక్టర్ సెగ్మెంట్ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈసారి సౌత్ నుంచి పలువురు స్టార్ హీరోలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఆ లిస్ట్ లో మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి భ్రమయుగం సినిమాతో టాప్ లో ఉన్నారు. ఆ చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. అలాగే తమిళ స్టార్ విక్రమ్ తంగలాన్ చిత్రంలో తన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు పొందారు. పాత్ర కోసం ఆయన హార్డ్ వర్క్ కూడా ప్రశంసలు అందుకుంది.

మరోవైపు మలయాళ నటుడు ఆసిఫ్ అలీ కిష్కింధకాండ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో నటించిన సాబిన్ సాహిర్ కూడా ఈసారి బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తరఫున అల్లు అర్జున్ పేరు గట్టుగా వినిపిస్తోంది. పుష్ప-2లో ఆయన యాక్టింగ్ కు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే పుష్ప-1 సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు మరోసారి అదే అవార్డు అందుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. అదే జరిగితే వరుసగా రెండు సినిమాలతో జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా మరో ప్రత్యేక గుర్తింపు ఆయన సొంతమవుతుంది. అయితే ఈసారి పోటీ మాత్రం చాలా గట్టిగా కనిపిస్తోంది.

మమ్ముట్టి, విక్రమ్, ఆసిఫ్ అలీ, సాబిన్ సాహిర్ వంటి నటులు తమ తమ సినిమాల్లో అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టడంతో విజేత ఎవరనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అందుకే బెస్ట్ యాక్టర్ విభాగంపై అందరి దృష్టి పడింది. వాస్తవానికి నేషనల్ ఫిల్మ్ అవార్డులు ఎప్పుడూ యాక్టింగ్ కు అత్యున్నత గుర్తింపుగా భావిస్తారు. అందుకే ఆ అవార్డును అందుకోవడం ప్రతి నటుడి కెరీర్‌ లో స్పెషల్ మూమెంట్ గా నిలుస్తుంది.

ఈసారి కూడా అదే స్థాయిలో పోటీ నెలకొనడంతో అనౌన్స్మెంట్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మరోసారి అల్లు అర్జున్ చరిత్ర సృష్టిస్తారా? లేక కొత్త విన్నర్ నేషనల్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ అవార్డు కైవసం చేసుకుంటారా? అనే ప్రశ్నకు సమాధానం మరికొన్ని గంటల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్న ప్రకటనతో తేలనుంది. అప్పటివరకు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉండనుంది.

Tags:    

Similar News