టాలీవుడ్.. ఇదే జోష్ కంటిన్యూ అవ్వాలంటే..

ఒక మంచి సినిమా వస్తే థియేటర్లలో సందడి కనిపించడం కామన్. కానీ వరుసగా చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తే మాత్రం ఓ సినీ ఇండస్ట్రీలో అయినా కొత్త ఉత్సాహం కనిపిస్తుంటుంది.

Update: 2026-07-07 12:30 GMT

ఒక మంచి సినిమా వస్తే థియేటర్లలో సందడి కనిపించడం కామన్. కానీ వరుసగా చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తే మాత్రం ఓ సినీ ఇండస్ట్రీలో అయినా కొత్త ఉత్సాహం కనిపిస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా విడుదలవుతున్న సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. దీంతో థియేటర్ల వద్ద సందడి పెరగడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానుల్లోనూ కొత్త జోష్ నెలకొంది.

ఇటీవల కాలంలో ఓటీటీ ఎఫెక్ట్, పెరిగిన టికెట్ ధరలు, ప్రేక్షకుల మారిన టేస్ట్ కారణంగా థియేటర్లకు వచ్చే వారి నెంబర్ పై అనేక డౌట్లు వ్యక్తమయ్యాయి.. ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్నాయి కూడా.. అయితే ఇప్పుడు పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాలతో పాటు విభిన్న కథలతో వచ్చిన చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కనిపిస్తోంది. కేవలం వీకెండ్స్ లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ థియేటర్లకు ప్రేక్షకులు వస్తుండటం విశేషం.

అయితే ఆ జోష్ ఇక్కడితో ఆగిపోకుండా కంటిన్యూ అవ్వాలంటే 2026 సెకండాఫ్ లో రిలీజ్ కానున్న సినిమాలు కీలకంగా మారనున్నాయి. భారీ అంచనాల మధ్య రానున్న స్టార్ హీరోల చిత్రాలతో పాటు మంచి కథాంశాలతో వచ్చే మీడియం అండ్ చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు చిత్రాలు మాత్రమే కాకుండా వరుసగా మంచి సినిమాలు వస్తేనే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది.

అంతే కాదు.. ముఖ్యంగా దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగల సీజన్‌ లో విడుదలయ్యే ఆయా సినిమాలపై ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తే నిర్మాతలకు ధైర్యం పెరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్లకు తమ ఇన్వెస్ట్మెంట్లపై నమ్మకం వస్తుంది. థియేటర్ల యజమానులకు కూడా మంచి రోజులు కొనసాగుతాయి.

ప్రస్తుతం ప్రేక్షకులు స్టార్ హీరోలకే కాకుండా మంచి కంటెంట్‌ కు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఇటీవలి చిత్రాల రిజల్ట్స్ చెబుతున్నాయి. అందుకే స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఈక్వల్ గా ఉంటేనే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఇదే ఫార్ములా రాబోయే సినిమాలు కూడా ఫాలో అయితే టాలీవుడ్‌ కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

ఏదేమైనా ప్రస్తుతం టాలీవుడ్‌ లో కనిపిస్తున్న జోష్ ఇండస్ట్రీకి మాత్రం పాజిటివ్ సిగ్నలే. అయితే ఆ ఉత్సాహం సాలిడ్ గా కంటిన్యూ అవ్వాలంటే అప్ కమింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాలి.. ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించాలి. అలా బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు నమోదైతేనే ఆ జోష్ టెంపరరీగా కాకుండా టాలీవుడ్‌ కు లాంగ్ రన్ స్ట్రెంత్ గా మారే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News