కార్తీ సినిమాలో టాలీవుడ్ హీరో?

టాలెంటెడ్ హీరో కార్తీ కి త‌మిళంలోనే కాకుండా తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కార్తీకి ఎంతోమంది అభిమానులున్నారు.;

Update: 2025-06-26 05:39 GMT

టాలెంటెడ్ హీరో కార్తీ కి త‌మిళంలోనే కాకుండా తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కార్తీకి ఎంతోమంది అభిమానులున్నారు. కార్తీకి కూడా టాలీవుడ్ అన్నా, తెలుగు ప్రేక్ష‌కుల‌న్నా ప్ర‌త్యేక అభిమానం. కార్తీ ప్ర‌స్తుతం పలు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. గ‌తేడాది స‌త్యం సుంద‌రం సినిమాతో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన కార్తీ ఈ ఏడాది నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వ‌చ్చిన హిట్3 క్లైమాక్స్ లో క‌నిపించి సంద‌డి చేశారు.

ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ పి.ఎస్ మిత్ర‌న్ తో కలిసి స‌ర్దార్2 షూటింగ్ లో పాల్గొన్న‌ కార్తీ, రీసెంట్ గానే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇప్పుడు కార్తీ29 సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకు తాన‌క్కార‌న్ ఫేమ్ త‌మిజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. గ‌తంలో త‌మిజ్ వెట్రిమార‌న్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేయ‌డంతో ఈ సినిమాపై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి.

జులై నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా కార్తీ29 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌నుంది. 1960 బ్యాక్ డ్రాప్ లో రామేశ్వ‌రం తీరం నేప‌థ్యంలో, స్మ‌గ్లింగ్ ప్లాట్ నుంచి స్పూర్తి పొందిన పీరియ‌డిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా త‌మిజ్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. నివిన్ పౌలీ, జ‌య‌రామ్ లాంటి కీల‌క తారాగ‌ణం ఉన్న ఈ మూవీ గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

కార్తీ29లో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించ‌నున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లొస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం కార్తీ29లో నాని ఓ క్యారెక్ట‌ర్ లో లేదా గెస్ట్ రోల్ లో క‌నిపించ‌నున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ సినిమా త‌ర్వాత కార్తీ లోకేష్ క‌గ‌న‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఖైదీ2 చేయ‌నున్నారు. ఖైదీ2 ఈ ఇయ‌ర్ ఎండింగ్ కు సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. ఇవి కాకుండా ప‌లు ప్రాజెక్టుల‌తో కార్తీ చాలా బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News