• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Rajasthan >  బీజేపీని ఓడిస్తున్న...

బీజేపీని ఓడిస్తున్న కాంగ్రెస్....మార్పు మొదలైందా ?

| రాజస్థాన్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 37 జిల్లా పరిషత్ స్థానాల్లో కాంగ్రెస్ 25 చోట్ల ముందంజలో ఉండగా, బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 1,271 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 794, బీజేపీ 357 గెలుచుకున్నాయి. ఈ ఫలితాలు భజన్‌లాల్ శర్మ ప్రభుత్వానికి రాజకీయ హెచ్చరికగా మారాయి.

By - Satya P
Update: 2026-11-21 23:57 GMT

ఉత్తరాదిన బీజేపీ పట్టు సడలుతోంది అని 2024 లోక్ సభ ఎన్నికలు సంకేతం ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్దదైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి మొత్తం 80 సీట్లకు గానూ దక్కింది 33 సీట్లు మాత్రమే. మిగిలినవి ప్రత్యర్ధులు గెలుచుకున్నారు. 2014లో 71 సీట్లు, 2019లో 62 సీట్లు గెలుచుకున్న బీజేపీ, 2024 లో సగానికి పైగా స్థానాలను కోల్పోయింది. ఇపుడు మరో ఉత్తరాది రాష్ట్రం బీజేపీకి భారీ షాక్ ఇస్తోంది. అదే రాజస్థాన్. రాజస్థాన్ లోని గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వెల్లడవుతున ఫలితాలను చూస్తే ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ మీద పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

కాషాయానికి కలవరం :

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన పంచాయతీ సమితులు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగడం కాషాయానికి కలవరం రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం చూసుకుంటే మొత్తం 37 జిల్లా పరిషత్ స్థానాలకు గాను కాంగ్రెస్ 25 స్థానాల్లో విజయం దిశగా సాగుతూంటే బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అంతే కాదు ఈ 37 జిల్లాలకు గాను 33 జిల్లాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం అదే తీరుగా కొనసాగడం కూడా ఆశచ్ర్యకరంగా ఉంది. ఇక మొత్తం 1,271 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ 794 స్థానాలను కైవసం చేసుకుంటే బీజేపీ 357 స్థానాలతో సరిపెట్టుకుంది. 7,520 పంచాయతీ వార్డుల ఫలితాలు వెల్లడి అయితే కాంగ్రెస్ 3,758 స్థానాలలో విజయం సాధించింది. బీజేపీ 2,213 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు నాలుగు జిల్లాల్లో ఫలితాలను డిసెంబరు 17న ప్రకటించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

మూడేళ్ళ పాలన మీద :

ఇదిలా ఉంటే రాజస్థాన్ లో బీజేపీ 2023లో అధికారంలోకి వచ్చింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలను సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఇక్కడ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మను బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే రాజస్థాన్ ఓటర్ల సంప్రదాయం ప్రకారం చూస్తే బీజేపీకి అపుడే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీ నిచ్చి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం మీద రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి.

మార్పు తప్పదా :

ఇది కేవలం రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పునా లేక ఉత్తరాదిన జాతీయ స్థాయిలో బీజేపీ పాలన మీద జనాలు ఇస్తున్న సందేశమా అన్నది కూడా చర్చగా ఉంది. సహజంగానే కాంగ్రెస్ ఈ ఫలితాలను ఆహ్వానిస్తూ కేంద్రంలో మోడీ పాలన మీద జనాలకు వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అని అంటోంది. అధికారంలో ఉన్నవారి అహంకారాన్ని ప్రజలు సహించబోరనే సందేశాన్ని ఈ ఫలితాల ద్వారా ప్రధాని మోదీకి ఇచ్చారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తీర్పు కేవలం రాజస్థాన్‌కే పరిమితం కాదని, దేశంలోని ప్రతి గ్రామం గొంతుక అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ దుష్పరిపాలనకు రాజస్థాన్ ప్రజలు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది ఎన్నికలు :

ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఉత్తరాదిన ఉన్న రాష్ట్రాలలో అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. యూపీ, ఉత్తరాఖండ్ సహా అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు కూడా ఇపుడు ఆసక్తిని పెంచబోతున్నాయి. 2029 ఎన్నికలు అంటే మరో రెండున్నరేళ్ళ సమయం మాత్రమే ఉంది. ఇక కాంగ్రెస్ కి రాజస్థాన్ ఫలితాలు మరిన్ని పోరాటాలకు ఉత్సాహం ఇస్తూంటే బీజేపీ తన పొరపాట్లను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఎంతటి పార్టీకైనా ప్రజా వ్యతిరేకత తప్పదని రాజస్థాని స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయని అంటున్నారు.

Tags:    
  • rajasthanelections 
  • congress 
  • bjp 
  • panchayatelections 

Similar News

బంగారంలో రీనియం కలిపేసి మోసం.. ఏ మెషీన్ కు, మనుషులకు చిక్కని దొంగ బంగారం స్కామ్

2026-11-21 06:33 GMT

100 మంది బౌన్సర్లు.. కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఈ గుర్రం రాచరికం వెనుక అసలు కథ

2026-11-17 10:01 GMT

యూట్యూబర్ ను సెల్ఫీ పేరుతో దగ్గరకొచ్చి ఏకంగా 'లిప్ కిస్' అడిగాడు.. తర్వాత చూడాలి..

2026-11-17 06:51 GMT

కలకలం : బీజేపీ నోట పాకిస్తాన్ కు మద్దతు !

2026-10-16 04:23 GMT

బీజేపీకి ఒకే ఒక్క ఓటు...ఇది గిన్నిస్ రికార్డే !

2026-09-15 04:13 GMT

సీజేపీ 'దెబ్బ'.. సీఎం అబ్బా.. రాజస్థాన్ స్కూళ్లకు రూ.12,500 కోట్లతో ఓ భారీ 'కాస్మోటిక్ మేకప్'

2026-08-24 17:10 GMT

ఓ సైనికుడికి కష్టం : దేశం కోసం 3 యుద్ధాలు.. సొంత భూమి కోసం నాలుగో యుద్ధం..

2026-07-13 03:07 GMT

బుల్డోజర్ న్యాయం.. మైనర్ బాలిక అత్యాచార ఇష్యూలో 3 హోటళ్ల కూల్చివేత!

2026-07-02 07:09 GMT

మోడీ మాస్క్‌తో మొబైల్ షాపుల్లో దొంగతనం.. సినిమాను తలపించేలా!

2026-06-30 18:31 GMT

భ‌గ‌భ‌గ‌లో ACతో పనే లేదు.. జైపూర్ రూఫ్‌టాప్ టెక్నిక్‌పై ఆనంద్ మహీంద్రా ప్ర‌శంస‌లు!

2026-05-26 08:30 GMT

2026 వరల్డ్ బెస్ట్ కల్చరల్ సిటీస్.. ఇండియాలో ఏది.. ఎలా డిసైడ్ చేస్తారు?

2026-05-15 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS