• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  విశాఖలో ఘోరం.. ఇంటికి...

విశాఖలో ఘోరం.. ఇంటికి వెళ్లి తహసీల్దార్ ను చంపేశారు

| ఉక్కునగరంగా.. ప్రశాంతమైన జీవనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విశాఖపట్నం ఈ ఉదయం (శనివారం) ఒక్కసారిగా ఉలిక్కిపడింది

By - Tupaki Desk
Update: 2024-02-03 05:36 GMT

ఉక్కునగరంగా.. ప్రశాంతమైన జీవనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విశాఖపట్నం ఈ ఉదయం (శనివారం) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖ నగరానికి నడిబొడ్డు లాంటి మధురవాడలోని ఒక అపార్టుమెంట్ కు వెళ్లి.. ఒక తహసీల్దార్ ను మర్డర్ చేయటం షాకింగ్ గా మారింది. శుక్రవారం రాత్రి వేళ జరిగిన ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనమైంది. ఆయన హత్య వెనుకున్న అసలు కారణం మాత్రం బయటకు రాలేదు.

మధురవాడలోని కొమ్మాదిలో ఒక అపార్టుమెంట్ లో ఐదో అంతస్థులో విశాఖ రూరల్ తహసీల్దార్ గా వ్యవహరిస్తున్నారు రమణయ్య. మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను విశాఖరూరల్ నుంచి విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి ట్రాన్సఫర్ చేశారు. శుక్రవారమే విజయనగరం వెళ్లి బాధ్యతలు స్వీకరించి విశాఖపట్నం వచ్చిన ఆయన్ను రాత్రి వేళ పది గంటల సమయంలో ఎవరో కలవటానికి వచ్చారు.

దీంతో.. తన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి.. లిఫ్టులో కిందకు దిగారు. అపార్టుమెంట్ గేట్ వద్ద ఒకరిని కలిసినట్లుగా సీసీ కెమేరాల ఫుటేజ్ లో బయటపడింది. అయితే.. కాసేపటికి వారిద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోపంలో ఉన్న అతడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో తహసీల్దార్ ను బలంగా కొట్టారు. దీంతో ఆయన కుప్పకూలిపోయారు. ఇదంతా గమనించిన అపార్టు మెంట్ వాచ్ మెన్ కుటుంబ సభ్యులు ఆయన్నుఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇంతకూ తలమీద రాడ్ కొట్టిన వ్యక్తి ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


Tags:    
  • Vizagtahsildarmurder 
  • Chinagadilitehsildar 
  • Ramanaiahmurder 
  • Vizagtahsildar 
  • Vizagmurdercase 
  • Tahsildarmurder 

Similar News

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

Copyright @2026

Powered by Blink CMS