• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  పోర్న్ కు ఒప్పుకున్న...

పోర్న్ కు ఒప్పుకున్న విశాఖ మహిళ... కట్ చేస్తే...!

| డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అలాగని ఎలాబడితే అలా సంపాదించేయొచ్చు అనుకుంటే వచ్చినంత వేగంగానే అవి ఆవిరి అయిపోతాయని పెద్దలు చెబుతుంటారు.

By - Tupaki Desk
Update: 2023-08-06 04:05 GMT

డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అలాగని ఎలాబడితే అలా సంపాదించేయొచ్చు అనుకుంటే వచ్చినంత వేగంగానే అవి ఆవిరి అయిపోతాయని పెద్దలు చెబుతుంటారు. కొన్ని సార్లు అత్యాశకు పోతే ఇబ్బడిముబ్బడిగా రావడం సంగతి దేవుడెరుగు.. ఉన్నవి, కట్టుకున్నవి కూడా పోతుంటాయని అంటుంటారు. తాజాగా విశాఖకు చెందిన మహిళ విషయంలో ఇదే జరిగింది.

అవును... అడ్డదారిలో అడ్డంగా సంపాదించేయాలనుకుంది ఒక మహిళ. దీనికోసం ఏకంగా పోర్న్ సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది. ఈ స్థాయిలో తెగించిన అనంతరం షూట్ కి సైతం వెళ్లింది. అనంతరం మోసపోయింది. బ్లేక్ మెయిల్స్ కి బలైంది. ఆఖరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... విశాఖకు చెందిన ఒక మహిళ (26) ఉపాధి కోసం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇందులో భాగంగా దిల్ సుఖ్ నగర్ లో ఉంటూ మ్యారేజ్ ఈవెంట్స్ చేసే కాంట్రాక్టులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగేళ్ల నుంచి ఒక వ్యక్తితో ఆమెకు పరిచయం ఉంది. ఏళ్లుగా పరిచయస్తుడు కావడంతో.. తన ఆర్థిక సమస్యల్ని అతడితో చెప్పుకునేది.

దీంతో అడ్వాంటేజ్ తీసుకున్న సదరు వ్యక్తి... ఆమెకు ఒక ఉచిత సలహా ఇచ్చాడు. తనకు ఒక పెద్ద పార్టీ తెలుసని, నీలి చిత్రాల్లో నటిస్తే 10 లక్షలు ఇస్తారని ఆశపెట్టాడు. ఇదే సమయంలో ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండకుండా... ముఖానికి చున్నీ కప్పుకుని నటిస్తే చాలని అన్నాడు. దీంతో ఈ చీకటి పనికి ఆమె ఒప్పుకుంది!

అవును 10 లక్షలకు ఆశపడి సదరు యువతి పోర్న్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం పంజాగుట్టలోని ఓ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం తాగమని చెప్పగా నిరాకరించింది. దీంతో కూల్ డ్రింక్ లో మద్యం కలిపి తాగించారు. అనంతరం మద్యం మత్తులో పడిపోయిన ఆమెను నగ్నంగా వీడియోలు తీశాడు.

ఇక అక్కడనుంచి ఇతగాడి అసలు స్వరూపం బయటపడింది. ఆ రోజు తీసిన వీడియోకి 10లక్షలు ఇవ్వడం సంగతి దేవుడెరుగు... ఆ వీడియోల ఆధారంగా కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఫోన్ చేసి లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడు.

ఇలా రోజురోజుకు ఈ బ్లాక్ మెయిల్ ఎక్కువ కావడంతో యువతి విసిగిపోయింది.. అతడు అడిగినంత డబ్బులు ఇవ్వలేక విసుగెత్తిపోయింది. ఆఖరికి పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    
  • Crime 
  • Vizag 
  • AndhraPradesh 

Similar News

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

డబ్బుల కోసం దాచేసి .. దొరికిపోతానని !

2026-10-13 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS