• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  లండన్ లో ఉండి మసాలా...

లండన్ లో ఉండి మసాలా పొడులు పంపి చంపేసిన అల్లుడు

| భార్యతో విభేదాల కారణంగా ఆమెను.. ఆమె కుటుంబాన్ని అంతమొందించాలని ఉద్దేశంతో భారీ కుట్రకు పాల్పడి.. అత్త ప్రాణాల్ని తీసిన లండన్ అల్లుడి ఉదంతమిది.

By - Tupaki Desk
Update: 2023-08-20 04:05 GMT

భార్యతో విభేదాల కారణంగా ఆమెను.. ఆమె కుటుంబాన్ని అంతమొందించాలని ఉద్దేశంతో భారీ కుట్రకు పాల్పడి.. అత్త ప్రాణాల్ని తీసిన లండన్ అల్లుడి ఉదంతమిది. సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. ఎంత గొడవలు ఉంటే మాత్రం.. ప్రాణాలు తీసేంతలా ప్లాన్ చేయాలా? అన్నది ప్రశ్నగా మారింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ లో ఉండే హన్మంతరావు.. ఉమామహేశ్వరి దంతపులకు ఒక కమార్తె ఉన్నారు. ఆమె పేరు శిరీష. డాక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 2018లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అజిత్ తో పెళ్లైంది.

ఉద్యోగాల రీత్యా వారిద్దరూ లండన్ లో సెటిల్ అయ్యారు. వారికో కుమార్తె ఉంది. కొంతకాలానికి దంపతుల మధ్య విభేదాలుచోటు చేసుకున్నాయి. దీంతో.. ఆమె లండన్ లోని పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తనపై కేసు పెట్టిన భార్యపై కోపం పెంచుకున్న అజిత్ కుమార్ భార్యను ఆమె కుటుంబాన్ని అంతం చేయాలని భారీ కుట్రకు తెర తీశారు.

ఇందులో భాగంగా లండన్ లో తన వద్ద పని చేసే వినోద్ కుమార్ ను ఒప్పించి.. వీరికి కామన్ ఫ్రెండ్స్ అయిన భవానీ శంకర్.. అశోక్.. గోపినాథ్ లతో కుట్ర పన్నారు. వీరు ఎంచుకున్న కామన్ ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్ లోనే ఉంటారు. తన ప్లాన్ ను అమలు చేసేందుకు తన భార్య సోదరుడి పెళ్లి వేళను టార్గెట్ చేసుకున్నారు. తన సోదరుడి పెళ్లి కోసం శిరీష హైదరాబాద్ కు వెళ్లారు. అత్తారింటిపై నిఘా వేసేందుకు వాచ్ మెన్ కొడుకు రమేశ్ కు కొంత డబ్బులు ఇచ్చారు. జూన్ 25న ముగ్గురు వ్యక్తులు పాయిజన్ ఇంజక్షన్లను తీసుకెళ్లారు. కానీ.. ఆ ప్లాన్ వర్కువుట్ కాలేదు.

తమ ప్లాన్ ను మార్చిన అజిత్.. గుర్తుతెలియని విషాన్ని కలిపిన మసాలా పొడుల్ని.. పసుపు.. కారం లాంటి పాకెట్లను శాంపిల్ పాకెట్ల పేరుతో డెలివరీ బాయ్ రూపంలో అందజేశారు. ఫ్రీగా వచ్చిందన్న ఉద్దేశంతో వాటి మీద పెద్దగా సందేహం లేని వారు.. వాటిని వాడారు. దీంతో.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అజిత్ అత్త (భార్య తల్లి) ఉమామహేశ్వరి జులై 5న మరణించారు. అయితే.. ఆమె మరణం అనారోగ్య కారణాలతోచోటు చేసుకుందని భావించారు.

అయితే.. భార్య శిరీష.. ఆమె తండ్రి.. సోదరుడు.. మరదలు.. మరో బంధువైన మహిళ కాళ్లు.. చేతులు స్పర్శ కోల్పోవటం.. ఒకేసారి అందరూ అనారోగ్యానికి గురి కావటంతో.. వారికి సందేహం కలిగింది. దీంతో.. బ్లడ్ శాంపిల్స్ ను టెస్టులకు పంపగా.. వారి రక్తంలో విష నమూనాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. భార్య శిరీష పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. వారున్న నివాషంలోని సీసీ కెమేరా ఫుటేజ్ ను తీసుకొని.. వాచ్ మన్ కొడుకు రమేశ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అదే అపార్టు మెంట్లో ఉండే ఫూర్ణేందర్ పేరును చెప్పాడు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. మొత్తం కుట్ర బయటకు వచ్చింది. దీంతో.. ఈ దారుణానికి సహకరించి.. హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ లో ఉన్న అజిత్ కుమార్ ను సైతం అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.

Tags:    
  • murder 
  • Crime 
  • Telangana 

Similar News

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

డబ్బుల కోసం దాచేసి .. దొరికిపోతానని !

2026-10-13 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS