• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  వెబ్ సిరీస్ స్ఫూర్తితో...

వెబ్ సిరీస్ స్ఫూర్తితో మీరట్ డబుల్ మర్డర్ కేసు.. షాకింగ్ నిజాలు బయటకు

By - Tupaki Desk
Update: 2023-08-13 06:32 GMT

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న కొన్ని దారుణాల్ని చూసినప్పుడు షాక్ తింటున్న పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మీరట్ లో చోటు చేసుకుంది. ఇద్దరు పెద్ద వయస్కుల్ని దారుణంగా చంపేసి.. వారి ఆస్తిపాస్తుల్ని కొట్టేసిన ఉదంతం పోలీసులకు సవాలుగా మారింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోని మిస్టరీని ఛేదించారు పోలీసులు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బోలెడన్ని బయటకు వచ్చాయి.

ఆ వివరాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. యూపీలోని మీరట్ పట్టణంలోని బ్రహ్మపురి ప్రాంతంలో 70 ఏళ్ల ధన్ కుమార్ జైన్.. 65 ఏళ్ల అంజు జైన్ లు నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వేళలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ పెద్ద వయస్కులపై బెదిరింపులకు దిగారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకోగా.. దుండగులు పిస్టల్ తో ఆ ఇద్దరిని కాల్చి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం.. నగదును దోచుకెళ్లారు.

పట్టపగలుచోటు చేసుకున్న ఈ డబుల్ మర్డర్ స్థానికంగా పెను సంచలనంగా మారింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు 48 గంటల గడిచేసరికి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఈ దారుణ నేరానికి పాల్పడిన వారిలో ఒకరు ఎల్ఎల్ బీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కావటం గమనార్హం.ఈజీ మనీకి అలవాటు పడిన వారు.. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఒక వెబ్ సిరీస్ (అసుర్) ను చూసిన పాతికేళ్ల ప్రియాంక్ శర్మ.. 24 ఏల్ల యశ్ శర్మలు ఇద్దరు కలిసి ఈ డబుల్ మర్డర్ కు ప్లాన్ చేశారంటున్నారు. దొంగతనం ఎలా చేయాలి? పోలీసులకుఎలా మస్కా కొట్టాలి? వారికి ఆధారాలు చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తమ గుర్తింపు దొరక్కుండా ఉండకుండా ఎలాంటి గ్లౌజ్ లు.. హెల్మెట్లు.. బైక్ నెంబర్లను మార్చేశారు. చివరకు సీసీ కెమేరాలు లేని రూట్లను కసరత్తుచేసి మరీ.. పారిపోయారు. అయితే.. పోలీసులు తమదైన శైలిలో విచారణకు దిగేసరికి.. గంటల వ్యవధిలో నిందితులు దొరికిపోయారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో దొంగల్ని అదుపులోకి తీసుకోవటం చాలా చాలా తేలికన్న విషయాన్ని మిస్ కాకూడదు. ఈ లాజిక్ మిస్ అయ్యి.. ఎల్ఎల్ బీ లాస్ట్ ఇయర్ చదువుతూ ఇప్పుడు జైలుఊచలు లెక్కిస్తున్న పరిస్థితి.

Tags:    
  • Meerut 
  • murder 
  • WebSeries 
  • Crime 

Similar News

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

Copyright @2026

Powered by Blink CMS