• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  సైబర్ నేరగాళ్ల...

సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు సూసైడ్ చేసుకున్న వృద్ధ దంపతులు

| సైబర్ నేరగాళ్ల అరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కంటికి కనిపించకుండా మాటలతో కోట్లు కొల్లగొడుతున్న వారి ఆశ చావటం లేదు

By - Tupaki Desk
Update: 2025-03-29 04:09 GMT

సైబర్ నేరగాళ్ల అరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కంటికి కనిపించకుండా మాటలతో కోట్లు కొల్లగొడుతున్న వారి ఆశ చావటం లేదు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే విషయంలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నా.. మిగిలిన వ్యవస్థలు వారి మాదిరి చురుగ్గా వ్యవహరించని పరిస్థితి. దీంతో.. సైబర్ నేరాలు అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. తాజాగా కర్నాటకలో చోటు చేసుకున్న విషాద ఉదంతం చూస్తే అయ్యో అనిపించక మానదు.

ఒక వృద్ధ జంటను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అమానవీయంగా వ్యవహరించారు. రూ.50 లక్షల వరకు గుంజినా.. వారిని వదలకుండా వెంటాడటం.. బెదిరింపులకు పాల్పడుతున్న ఉదంతాలతో భయానికి గురైన వారు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 83 ఏల్ల డియాగో నజరత్.. 79 ఏళ్ల పావియాలు కర్ణాటకలోని ఖానాపూర తాలూకా బీడి గ్రామంలో ఉంటున్నారు.

ఆయన గతంలో రైల్వే శాఖలో కీలక స్థానాల్లో పని చేసి రిటైర్ అయ్యారు. కొద్ది రోజులుగా ఆయనకు సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ‘మీ ఫోటో గుర్తింపు కార్డులను వినియోగించుకొని కొందరు సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ కేసులో మిమ్మల్ని విచారణ చేయాల్సి ఉంటుంది. నేరం రుజువైతే అరెస్టు చేయాల్సి ఉంటుంది’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీని నుంచి బయటపడేందుకు ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు బదిలీ చేశారు.

అయినా.. సైబర్ నేరగాళ్ల ఆశ తీరలేదు. మరింత డబ్బులు పంపాలని వారిపై ఒత్తిడి చేయసాగారు. ఈ ఒత్తిళ్లు తీవ్రం కావటంతో.. ఈ వృద్ధ దంపతులు తీవ్రమైన మనోవ్యధకు గురై.. చివకు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా మరింత అప్రమత్తంగా ఉండటమే కాదు.. ఎవరైనా తప్పుడు బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే.. ఫలితం సానుకూలంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

Tags:    
  • CyberExtortion 
  • CyberCrimeAlert 
  • ElderlySuicide 
  • Karnataka 
  • OnlineScams 
  • CyberCrime 
  • CyberScam 
  • KarnatakaCrime 
  • CyberSecurity 

Similar News

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

Copyright @2026

Powered by Blink CMS