• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  బెజవాడలో సైకో ప్రేమ.....

బెజవాడలో సైకో ప్రేమ.. ప్రేయసి ముందే ఆమె తండ్రిని చంపేశాడు

| కులాలు వేర్వేరు కావటంతో ఇంట్లో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి నో చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పది మందిని తీసుకొని శ్రీరామ్ ప్రసాద్ అబ్బాయి ఇంటికి వెళ్లి.. వాళ్ల అమ్మతో మాట్లాడారు.

By - Tupaki Desk
Update: 2024-06-28 13:30 GMT

నా కూతురితో ప్రేమ వ్యవహారం వద్దని చెప్పటమే ఆయన తప్పైంది. అంతే.. అతడి మీద కక్ష పెంచుకున్న సదరు సైకో లవ్వర్.. తన ప్రేయసి ఎదుటే ఆమె తండ్రిని హత్య చేసిన కిరాతకం విజయవాడలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విజయవాడలోని క్రష్ణలంక పరిధిలో చోటు చేసుకున్న ఈ రాక్షస ప్రేమ ఉదంతంలోకి వెళితే..

విజయవాడ బృందావన్ కాలనీకి చెందిన కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ కు ఒక జనరల్ స్టోర్ ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె 22 ఏళ్ల దర్శిని విజయవాడలోని శ్రీపొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె స్నేహితురాలు హరిత ద్వారా గడ్డం శివమణికంఠతో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయానికి వచ్చారు.

కులాలు వేర్వేరు కావటంతో ఇంట్లో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి నో చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పది మందిని తీసుకొని శ్రీరామ్ ప్రసాద్ అబ్బాయి ఇంటికి వెళ్లి.. వాళ్ల అమ్మతో మాట్లాడారు. తన కూతురితో ప్రేమ వ్యవహారం వద్దని చెప్పాడు. దీనికి మణికంఠ తల్లి సైతం కొడుకును వారించింది. దీంతో కోపానికి గురైన అతడు.. గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో షాపు మూసేసి ఇంటికి వెళుతున్న శ్రీరామ్ ప్రసాద్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కింద పడిపోయినప్పటికీ విడిచి పెట్టకుండా పలుమార్లు కత్తితో పొడిచాడు.

తన ఇంటికి వచ్చి.. తన తల్లితో ప్రేమ వద్దని మాట్లాడతాడా? అంటూ ఆగ్రహంతో అరుస్తూ.. అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ ప్రసాద్ ను ఒకప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరిశీలించిన వైద్యులు మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘోర ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. ఎంత ప్రేమ అయితే మాత్రం.. తన ప్రేయసి ముందే.. ఆమె తండ్రిని చంపేసిన ఈ సైకో ప్రేమికుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Tags:    
  • Andhrapradesh 
  • Bejawada 
  • Crime 
  • Murder 
  • Sriramprasad 
  • Cast 
  • Vijayawadabrindavancolony 
  • Politicalnews 

Similar News

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

Copyright @2026

Powered by Blink CMS