• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  ఇంటికి పిలిచి చంపేసి.....

ఇంటికి పిలిచి చంపేసి.. 400 ముక్కలు చేసిన తండ్రీకొడుకులు

| చంపేసిన అనంతరం అతడ్ని 400 ముక్కలుగా నరికేసి.. శరీర భాగాల్ని వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఆమానుష ఘటన బయటకు వచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-11-30 05:07 GMT

విన్నంతనే ఒళ్లు జలదరింపునకు గురయ్యే ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. గొడవ పడిన యువకుడ్ని రాజీ కోసం తమ ఇంటికి రావాలని ఆహ్వానించి..అనూహ్యంగా చంపేయటం ఒక ఎత్తు అయితే.. చంపేసిన అనంతరం అతడ్ని 400 ముక్కలుగా నరికేసి.. శరీర భాగాల్ని వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఆమానుష ఘటన బయటకు వచ్చింది. ఢిల్లీ కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ ను ఆమె ప్రియుడు ఏ రీతిలో అయితే.. హతమార్చాడో.. అదే తీరును తాజా ఉదంతంలో కనిపిస్తుంది. హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత కానీ ఈ దుర్మార్గం బయటకు రాకపోవటం గమనార్హం.

విన్నంతనే గగుర్పాటుకు గురయ్యే ఈ ఉదంతంలోకి వెళితే.. గ్వాలియర్ జిల్లా బహదుర్ పుర గ్రామానికి చెందిన రాజు ఖాన్ కు అదే ప్రాంతానికి చెందిన కల్లు ఖాన్.. నజీంఖాన్ అనే తండ్రీ కొడుకులతో గొడవైంది. ఇది కాస్తా కేసుగా నమోదైంది. దీంతో.. తమపై కేసు పెట్టిన రాజు ఖాన్ తో రాజీ కోసం తమ ఇంటికి రావాలని కోరారు. రాజీలో భాగంగారూ.20వేలు ఇవ్వాలన్న రాజు ఖాన్ డిమాండ్ కు ఓకే చెప్పారు తండ్రీకొడుకులు.

ఇంటికి వచ్చిన రాజు ఖాన్ ను మాట్లాడుతున్నట్లుగా నటించి.. డంబెల్ తో అతడి నెత్తి మీద బలంగా మోదారు. దీంతో అతను కింద పడిపోగా.. అనంతరం చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కులుగా చేసి 15 ప్రాంతాల్లో సంచుల్లో తీసుకెళ్లి పడేశారు. ఈ దారుణ ఉదంతం సెప్టెంబరు రెండు.. మూడు వారాల మధ్య జరిగింది. అయితే.. సెప్టెంబరు గుర్తు తెలియని యువకుడి మొండెం స్థానిక మురుగుకాలువలో కనిపించటం సంచలనంగా మారింది. దీన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. ఈ తండ్రీకొడుకుల దుర్మార్గం బయటకు వచ్చింది. అయితే.. రాజుఖాన్ ను హతమార్చిన తర్వాత అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. వారి కోసం వెతికిన పోలీసులు ఇటీవల వారిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో తాము చేసిన దుర్మార్గాన్నిపోలీసులకు వివరించారు. రాజు ఖాన్ ను చంపేసిన తర్వాత 400 ముక్కలుగా నరికి.. 15 సంచుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లుగా చెప్పటంతో పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి.

Tags:    
  • Gwalior 
  • District 
  • Bahadurpura 
  • Murder 
  • Father 
  • Son 
  • Youngman 
  • Brutallykilled 
  • Chopped 
  • Murdered 

Similar News

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

Copyright @2026

Powered by Blink CMS