• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Box Office >  బిజినెస్ మెన్ రీ రిలీజ్.....

బిజినెస్ మెన్ రీ రిలీజ్.. బాబు ఊచకోత పక్కా

| టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన రెండవ సినిమా బిజినెస్ మెన్.

By - Tupaki Desk
Update: 2023-08-07 11:57 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన రెండవ సినిమా బిజినెస్ మెన్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2012లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక అప్పుడే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబుకు మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇక సినిమా విడుదలై 10 సంవత్సరాల దాటినా కూడా అదే తరహా క్రేజ్ అందుకుంటూ ఉండటం విశేషం.

ఇక ఇప్పుడు మళ్లీ సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన 4K టెక్నాలజీలో అప్డేట్ చేసిన వెర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ఇక గత నెల రోజుల నుంచి బిజినెస్ మెన్ కు సంబంధించిన హడావిడి సోషల్ మీడియాలో గట్టిగానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రీసెంట్ గా ఓపెన్ అయ్యాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమాను చూసేందుకు చాలా కసిగా ఉన్నారు అని అనిపిస్తోంది.

ఎందుకంటే ఆ రేంజ్ లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. దాదాపు అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాదులో ఈ సినిమా ఊహించిన విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కోటికి పైగా కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రి రిలీజ్ ట్రెండ్ లో లో అయితే ఇది ఒక సరికొత్త రికార్డుగా నిలవబోతోంది.

మహేష్ బాబు పోకిరి సినిమాతో పాటు ఒక్కడు సినిమా కూడా రిలీజ్ ట్రెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగా పెరిగిపోయాయి. సినిమాలో మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు బోల్డ్ డైలాగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. దానికి తోడు సంబంధించిన సంగీతం కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా మొదట రిలీజ్ అయినప్పుడే కాకుండా ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇక ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు మాత్రం కొత్త సినిమాల అప్డేట్స్ ఏమీ ఉండకపోయినా కూడా బిజినెస్ మెన్ తో మాత్రం ఫ్యాన్స్ హై లెవెల్లో సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    
  • Businessman 
  • MaheshBabu 
  • BoxOffice 
  • Tollywood 
  • MovieNews 

Similar News

సపోర్ట్ ఓకే.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటేనే..

2026-11-07 05:52 GMT

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

పండగ రేసులో భారీ చిత్రాల సునామీ

2026-11-01 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS