ప్రధాని తల్లికి నిద్రపట్టడం లేదు!

Update: 2015-07-19 15:43 GMT
"కొద్ది రోజులుగా నాకు నిద్ర పట్టడంలేదు. నిత్యం నా కొడుకు గురించిన ఆలోచనలే... వాటి తాలూకు ఆవేదనలే! ఇన్ని కోట్లమంది ఉన్న దేశ భారాన్నంతా నా కొడుకు ఒక్కడే మోస్తున్నాడని అనిపిస్తుంటుంది. ఇన్ని ఒత్తిళ్లమధ్య నా కుమారుడు నా దగ్గరకు వచ్చి ఒడిలో పడుకుని సేదతీరితే బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ... వాడు దేశ ప్రధాని కదా... క్షణం కూడా తీరికలేకపోవడం వల్ల... ఆ అవకాశం నాకు లేదు, వాడికీ రావడం లేదు"! ఇది దేశప్రధాని తల్లి ఆవేదన! కొడుకు ప్రధాని అయినా, దేశాధ్యక్షుడు అయినా, రాజైనా, కూలైనా... తల్లి మనసు ఇలానేకదా ఆలోచించేది!

ప్రస్తుత గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సైప్రస్ తల్లి పడుతున్న బాద ఇది. తీవ్ర సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న దేశాన్ని గట్టెక్కించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్న గిరీస్ ప్రధాని చాలా బాదపడుతున్నాడని... కనీసం తన పిల్లలను కలుసుకునే అవకాశం కూడా లేకుండాపోయిందని... తిండి నిద్ర లేకుండా దేశం గురించి ఆలోచిస్తున్నాడని ప్రధాని మాతృమూర్తి అరిస్ట్రి సైప్రస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా స్పందించారు.

ఒకవైపు తన కొడుకు పడుతున్న శ్రమను చూసి బాదపడుతూనే... త్వరలో తన దేశాన్ని ఉన్నతంగా నిలబెడతాడనే ఆశాభావాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు. తల్లి మనసు కొడుకు హోదాతోనూ, స్థాయి తోనూ, వయసుతోనూ సంబందం లేకుండా ఆలోచిస్తుందని... బిడ్డ ఎప్పటికీ తన తల్లికి చంటిబిడ్డే అని మరోసారి అర్ధం అవుతుంది అని చెప్పొచ్చు!
Tags:    

Similar News