చైనాలో అంతే; వెరైటీ పబ్లిసిటీ కాస్తా పోలీస్ కేస్ అయ్యింది

Update: 2015-07-24 04:16 GMT
వెరైటీ కాస్తా పోలీస్ కేసుగా మారింది. స్వేచ్ఛ తక్కువగా.. ఆంక్షలు ఎక్కువగా ఉండే చైనాలో పబ్లిసిటీ కోసం చేసిన పని పోలీసు కేసుగా మారింది. దాదాపు వంద మంది విదేశీయుల్ని చైనా పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. ఇంతకు వారంతా చేసిన దారుణం ఏమిటని ఆరా తీస్తే ఆశ్చర్యపోక మానరు.

ఇంతకీ వారు చేసిందేమంటే.. స్పార్టన్ వారియర్స్ మాదిరి లెదర్ షార్ట్స్ (కాస్త వివరంగా చెప్పాలంటే.. అర్థనగ్నంగా) వేసుకొని బీజింగ్ వీధుల్లో తిరిగారు. బహిరంగ ప్రదేశాల్లో కలకలం సృష్టిస్తున్నారన్న మాటతో బీజింగ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బీజింగ్ లోని సలాడ్ స్వీటీ అన్న రెస్టారెంట్ ప్రచారంలో భాగంగా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచారం సంగతి తర్వాత పోలీస్ కేసుగా మారిందని ప్రచారంలో పాల్గొన్న విదేశీయులు ఫీలవుతున్న పరిస్థితి.
Tags:    

Similar News