• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  నెక్సాన్, క్రెటా ఈవీలకు...

నెక్సాన్, క్రెటా ఈవీలకు షాక్.. 460 కి.మీ. రేంజ్‌తో ఎంజీ విండ్‌సర్ ప్రో రిలీజ్!

| ఎంజీ మోటార్స్ ఉత్పత్తి చేసిన కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ పై కన్నేసిన ఈ కంపెనీ మరో అద్బుతమైన కారు ఆవిష్కరణ చేసింది.

By - Tupaki Desk
Update: 2025-05-06 11:41 GMT

ఎంజీ మోటార్స్ ఉత్పత్తి చేసిన కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ పై కన్నేసిన ఈ కంపెనీ మరో అద్బుతమైన కారు ఆవిష్కరణ చేసింది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV మంగళవారం, మే 6న విడుదల అయింది. ఈ కారు టాటా నెక్సాన్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీలకు గట్టిపోటీ ఇస్తుందని అంటున్నారు. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న JSW MG విండ్‌సర్ లాంగ్ రేంజ్ మోడల్ రిలీజ్ చేసింది. కంపెనీ దీనికి JSW MG విండ్‌సర్ ప్రో అని పేరు పెట్టింది. ఇది ఒకే ఛార్జ్‌పై ఎక్కువ దూరం ప్రయాణించగలదు.

విండ్‌సర్ ప్రోలో కంపెనీ అనేక మార్పులు చేసింది, తద్వారా ఇది తక్కువ రేంజ్ కలిగిన విండ్‌సర్ నుంచి పూర్తి భిన్నంగా ఉండనుంది. విండ్‌సర్ ప్రోలో కంపెనీ అల్లాయ్ వీల్ డిజైన్‌ను మార్చి, డైమండ్ కట్ వీల్స్‌ను అందించింది. ఈ వీల్స్ సరిగ్గా ఎంజీ హెక్టర్‍లో ఉపయోగించిన వీల్స్ లాగానే ఉన్నాయి. అంతేకాకుండా, కొత్త విండ్‌సర్ ప్రో సేఫ్టీ పరంగా కూడా అద్భుతంగా ఉండబోతోంది. దీని టెయిల్ లైట్ దగ్గర ADAS బ్యాడ్జ్ ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. దీని ద్వారా ఈ కారులో మీకు ఎక్స్ ట్రా రేంజ్‌తో పాటు ఎక్స్ ట్రా సేఫ్టీ కూడా లభిస్తుందని స్పష్టమవుతోంది. సాధారణ విండ్‌సర్ ఈవీలో ప్రస్తుతం ADAS ఫీచర్ లేదు.

కంపెనీ విండ్‌సర్ ప్రోను కొత్త కలర్ థీమ్‌లో కూడా వచ్చింది. ఇది సాధారణ, ప్రీమియం కస్టమర్‌లను వేర్వేరుగా ఆకర్షించడానికి సహాయపడుతుంది. విండ్‌సర్ ప్రోలో కంపెనీ ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని జోడించింది. దీని ద్వారా ఈ కారును ఇంటికి ఇన్వర్టర్‌గా కూడా ఉపయోగించవచ్చు. వాస్తవానికి ఇందులో V2L అంటే వెహికల్ 2 లోడ్ టెక్నాలజీని అందించారు. దీని సహాయంతో మీరు ఈ కారు బ్యాటరీని ఇతర పరికరాలకు విద్యుత్ సరఫరా చేయడానికి ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం విండ్‌సర్ కారులో కంపెనీ 38 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఇది ఒకే ఛార్జ్‌పై 332 కి.మీ. క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. కొత్త విండ్‌సర్ ప్రోలో కంపెనీ 50.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను తీసుకువచ్చింది. దీని క్లెయిమ్డ్ రేంజ్ 460 కి.మీ.. అయితే దీని ధర సాధారణ ఎంజీ విండ్‌సర్ కంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది.

విండ్‌సర్ ఈవీని కంపెనీ గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.10 లక్షల లోపు ఉంది, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ఆప్షన్ కూడా అందించారు. ఈ విధంగా ఈ కారు రాత్రికి రాత్రే మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. అమ్మకాల విషయంలో ఇది వరుసగా అనేక నెలలు నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించింది. నెక్సాన్, పంచ్‍లను కూడా వెనక్కి నెట్టింది. దీని ఎక్స్‍పెక్టెడ్ ధర రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉండవచ్చు. ఎక్కువ రేంజ్, లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న విండ్‌సర్ ప్రో విడుదలైన తర్వాత, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ సెగ్మెంట్‌లో తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది.

Tags:    
  • WindsorPro 
  • EVCars 
  • TataNexonEV 
  • HyundaiCretaEV 
  • MGWindsorPro 
  • ElectricSUV 
  • SmartEV 
  • MGIndia 
  • ElectricInnovation 

Similar News

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

ప్రయాణ భద్రతను కట్టుదిట్టం చేస్తున్న చైనా.. కారణం ఇదే..

2026-02-15 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS