లక్షన్నర కార్లు వెనక్కి !

Update: 2015-07-13 08:43 GMT
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ కార్ల కంపెనీ లక్షన్నర కార్లను వెనక్కు రప్పించింది. కారులో ఏర్పడిన చిన్న సాంకేతిక సమస్య మూలంగా షార్ట్ సర్కూట్ ఏర్పడి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తేలింది. వెంటనే ఆ కార్లు కొన్న లక్షన్నర మంది వినియోగదారులకు ప్రత్యేకంగా లేఖలు రాసి కార్లను వెనక్కు రప్పించి మరమ్మతులు నిర్వహించి లోపాలను సరిచేశారు.

2007  నుండి 2014 వరకు విడుదల చేసిన షెవ్రోలే స్పార్క్, షెవ్రోలే ఎజాయ్, షెవ్రోలే బీట్ మోడళ్లలో బ్యాటరీలలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు జనరల్ మోటార్స్ సంస్థ గుర్తించింది. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన సంస్థ వినియోగదారులకు లేఖలు రాసింది. తమ సమీపంలోని షెవ్రోలే షోరూంకు వెళ్లి రెండుగంటల సమయం ఇస్తే లోపాలు సరిదిద్దుతామని వెల్లడించింది.
Tags:    

Similar News