2024లో ప్రధానులు మృతి, యుద్ధం... స్వామీజీ సంచలన జోస్యం!

కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొంతమంది స్వామీజీలు, జోతిష్యులు అనబడేవారు భవిష్యత్తు గురించి, ఈ ఏడాది జరగబోయేది ఇదే అంటూ రకరకాల విషయాలు వెల్లడిస్తూ ఉంటున్న సంగతి తెలిసిందే.

Update: 2024-01-27 16:30 GMT

కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొంతమంది స్వామీజీలు, జోతిష్యులు అనబడేవారు భవిష్యత్తు గురించి, ఈ ఏడాది జరగబోయేది ఇదే అంటూ రకరకాల విషయాలు వెల్లడిస్తూ ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఫలానా రోజు యుగాంతం అని చెప్పి.. ఆ తర్వాత రోజు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన జ్యోతిష్కులు కూడా ఉన్నారని అంటుంటారు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఒక స్వామిజి  2024 సంవత్సరానికి సంబంధించి భయంకరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

అవును... 2023లో అతివృష్టి, అనానృష్టి.. రెండింటినీ చూసిన భారతదేశానికి 2024లో ఎన్నో విపత్తులు, మరిన్ని ఘోర సంఘటనలు చూడటం తప్పదని చెబుతున్నారు కర్ణాటకకు చెందిన ప్రముఖ స్వామిజీ, శ్రీ కోడిమఠానికి చెందిన డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ. ఇందులో భాగంగా... 2024లో అకాల వర్షాలు, బాంబు పేలుళ్లతో పాటు యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... 2024లో ప్రపంచవ్యాప్తంగా ఒకరిద్దరు ప్రధానులు చనిపోతారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ... ఈ ఏడాది పెద్ద ప్రమాదాలు జరుగుతాయని, అకాల వర్షాలు కురవడం వల్ల విపరీతమైన సమస్యలు వచ్చి లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని ఆయన మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు!!

Read more!

ఇందులో భాగంగా... బాంబు పేలుళ్లలో వందలాది మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉందని.. మతపరమైన సమస్యల కారణంగా ప్రజలు మరింత నష్టపోతారని.. ప్రపంచంలోని ప్రభావవంతమైన వ్యక్తులు చనిపోతారని.. సరికొత్త వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని.. భారీ సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని.. భూకంపాలు వస్తాయని.. ప్రజలు భయాందోళనకు గురవుతారని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ తెలిపారు!!

ఇలా ఇవన్నీ చెప్పిన ఆయన.. వీటన్నింటి నుంచి ప్రజలను కాపాడే శక్తి భగవంతుడికి ఉందని, అంతా దేవుడిని ప్రార్థించుకోవాలని సెలవిచ్చారు. గతంలో కూడా ఈయన చెప్పిన కొన్ని విషయాలు నిజం కావడంతో ఆయన జోస్యంపై పలువురు ప్రజానికానికి నమ్మకం ఉందని చెబుతుంటారు. ఇదే సమయంలో... ఉగాది తర్వాత కర్ణాటక, దేశ రాజకీయాలపై కూడా అంచనాలు చెబుతానని రాజేంద్ర స్వామీజీ తెలిపారు!!





 


Tags:    

Similar News