• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  అమెరికాకు ప్రకృతి ఇచ్చిన...

అమెరికాకు ప్రకృతి ఇచ్చిన ‘థ్యాంక్స్ గివింగ్’ రిటర్న్ గిఫ్ట్.. విందులకు బదులు ‘బాంబ్ సైక్లోన్’ విలయం

| అమెరికా తూర్పు తీరాన్ని బాంబ్ సైక్లోన్ అతలాకుతలం చేసింది. న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సుమారు 9 లక్షల మంది విద్యుత్‌కు దూరమయ్యారు. 420 విమానాలు రద్దు కాగా, మరో 2 వేల విమానాలు ఆలస్యమయ్యాయి. తుపాను ప్రభావంతో మేసీస్ థ్యాంక్స్ గివింగ్ పరేడ్ కూడా వాయిదా పడింది.

By - A.N.Kumar
Update: 2026-11-27 04:59 GMT

ఏమైందో కానీ ఈ మధ్య అమెరికన్లకు ఏదీ కలిసి రావడం లేదబ్బా.. ఓవైపు చిత్తుగా ఓడించినా కూడా ట్రంప్ మళ్లీ టారిఫ్ లు అంటూ అమెరికన్లనే దెబ్బతీస్తున్నారు. మరోవైపు కానీ ట్రంప్ బాధ పడలేక పండుగ చేసుకుందామంటే బాంబ్ సైక్లోన్ వచ్చిపడేసింది. అదీ పండుగ పూట.. పాపం అమెరికన్ల బాధ చూడాలి..

అమెరికన్లంతా ఆత్మీయులతో కలిసి టర్కీ కోడి విందులు ఆరగించాల్సిన థ్యాంక్స్ గివింగ్ వేళ ప్రకృతి తనదైన స్టైల్లో ఓ భారీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. పండుగ పూట పూల వర్షం కురుస్తుందనుకుంటే ఏకంగా బాంబ్ సైక్లోన్ రూపంలో ఆకాశం చిల్లు పడినట్టు కుండపోత వర్షం విరుచుకుపడింది. ఫలితం ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలోని టాప్ నగరాలు కాస్తా జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.

అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే.. న్యూయార్క్, న్యూజెర్సీ వీధులు అచ్చం వెనిస్ నగరాన్ని తలపిస్తున్నాయి. కార్లు నడవాల్సిన రోడ్లన్నీ నదులుగా మారిపోగా న్యూజెర్సీలోని హొబుకెన్ రైలు పట్టాలు నీట మునిగి అండర్ వాటర్ మెట్రోను గుర్తుచేస్తున్నాయి. స్టోన్ హార్బర్‌లోకి నీరు చేరడంతో స్థానికులు తమ ఇళ్లను కాపాడుకునే పనిలో పడ్డారు.

అభివృద్ధిలో అగ్రగామి అని చెప్పుకునే అమెరికాలో ఒక్క తుపాను దెబ్బకు ఏకంగా 9 లక్షల మంది చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవర్ ట్రాకింగ్ సైట్ల లెక్కల ప్రకారం జనం కరెంట్ కష్టాలతో సతమతమవుతుంటే విమానాశ్రయాల్లో ప్రయాణికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సొంతూళ్లకు వెళ్దామని బ్యాగులు సర్దుకున్న వారికి 420 విమానాల రద్దు.. మరో 2 వేల విమానాల ఆలస్యం రూపంలో ఎయిర్‌పోర్టులే తాత్కాలిక నివాసాలయ్యాయి.

అట్లాంటిక్ తీరంలోని 25 రాష్ట్రాల్లో సుమారు 25 కోట్ల మంది ప్రజలు ఈ ప్రకృతి ప్రకోపానికి వణికిపోతున్నారు. మేరీల్యాండ్‌లో 19 లక్షల మందికి మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక గాలుల తీవ్రతకు ఖాళీ ట్రాలీలు.. బైకులు గాల్లో ఎగిరిపోతాయన్న భయంతో జార్జి వాషింగ్టన్ వంతెనపై వాటికి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా వందేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ప్రతిష్టాత్మక మేసీస్ థ్యాంక్స్ గివింగ్ డే పరేడ్ ను కూడా ఈ తుపాను వాయిదా వేయించిందంటే అది ఏ లెవల్ లో విరుచుకుపడిందో అర్థం చేసుకోవచ్చు.

పేరులో ‘బాంబ్’ ఉన్నంత మాత్రాన ఇది ఏ దేశమో వేసిన అస్త్రం కాదు.. కేవలం 24 గంటల్లోనే వాతావరణ పీడనం అసాధారణ స్థాయిలో పడిపోయే బాంబోజెనిసిస్ ప్రక్రియ వల్ల పుట్టుకొచ్చిన తుపాను. పండుగ పూట షాపింగ్ మాల్స్‌ను.. విందు హాళ్లను నింపాల్సిన అమెరికన్లను ప్రకృతి తన పవర్ చూపించి ఇళ్లకే పరిమితం చేసింది.



అమెరికాలో థాంక్స్ గివింగ్ వేళ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో 8.36 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 1,800 విమానాలు ఆలస్యమవగా, 417 సర్వీసులు రద్దయ్యాయి. పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. #USStorm #Thanksgiving #SevereWeather #Flooding #USA #BreakingNews

— Tupaki (@tupaki_official) November 27, 2026


WATCH: FDNY firefighters walk through high waters during severe storm. https://t.co/aF7XsfJzCK

— NYScanner (@nyscanner) November 26, 2026


Tags:    
  • bombcyclone 
  • usweather 
  • thanksgiving 
  • newyork 
  • newjersey 
  • usa 
  • extremeweather 

Similar News

హవ్వా.. అమెరికన్లకు ఎంత గతి పట్టింది.. టాయిలెట్ పేపర్ల కోసం పాకులాట..

2026-11-26 17:25 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

పంది కిడ్నీతో ఏడాది గడిపిన మహిళ.. డయాలసిస్ అవసరం లేకుండా!

2026-11-25 17:53 GMT

భారత్‌కు ట్రంప్ మరో షాక్.. ఎగుమతులపై కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన!

2026-11-25 17:53 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

మళ్లీ టారిఫ్ లా? కుక్కతోక వంకర.. ఈ ట్రంప్ బుద్ది ఇక మారదా?

2026-11-25 07:06 GMT

అమెరికా కలకు బీటలు.. ఆ బంగారు పంజరాన్ని వీడి సొంత గూటికి భారతీయ టెకీల పయనం

2026-11-24 09:52 GMT

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!

2026-11-24 05:42 GMT

11 రోజులకే మళ్లీ పగ్గాలు.. ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ వెనుక అసలేం జరిగింది?

2026-11-23 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS