వాళ్లిప్పుడు 15 ఏళ్ల క్రితం జక్కన్న స్ట్రాటజీతో?
కథను ముందే చెప్పి రిలీజ్ చేయడం అన్నటి నాటి స్ట్రాటజీ. కానీ ఇప్పుడు కథను చెప్పకుండా రిలీజ్ చేయడం అన్నది నేటి స్ట్రాటజీ.;
కథను ముందే చెప్పి రిలీజ్ చేయడం అన్నది నాటి స్ట్రాటజీ. కానీ ఇప్పుడు కథను చెప్పకుండా రిలీజ్ చేయడం అన్నది నేటి స్ట్రాటజీ. స్టోరీ సహా పాత్రలు ఎలా ఉంటాయి? అన్నది నేరుగా తెరపై చూస్తేనే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని చాలా మంది దర్శకులు స్టోరీ ముందే రివీల్ చేయడం లేదు. చిన్న లైన్ మాత్రమే చెబుతున్నారు. మిగతాదంతా సస్పెన్స్ అంటూ ముగిస్తున్నారు. ఇలా రిలీజ్ అయిన సినిమాలు కొన్ని మంచి విజయాలు సాధించగా...కొన్ని పరాజయం చెందాయి.
కంటెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ అయ్యాయి. లేని సినిమాలు ఫెయిలయ్యాయి. అయితే కథను ముందే రివీల్ చేసి పక్కాగా హిట్ కొట్టిన దర్శకుడు రాజమౌళి. 15 క్రితమే ఆయన ఈ స్ట్రాటజీతో సినిమాలు రిలీజ్ చేసారు. 'మగధీర', 'ఈగ', 'మర్యాద రామన్న' లాంటి సినిమాలు అలా చేసినవే. వాటి సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఇదే స్ట్రాటజీతో ఓ మూడు సినిమాలు రూపొందుతున్నట్లు కనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' తెరకెక్కిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ చిత్రం కథ ఎలా ఉంటుంది? పాత్రలు ఎలా సాగుతాయి? అన్నది గౌతమ్ ముందే రివీల్ చేసాడు. ఇది శ్రీలంకలో జరిగే కథ ఇది. ఇది అన్నాదమ్ముల కథ. శ్రీకాకుళంలో వెళ్లిన అన్న కనిపించక పోయేసరికి తమ్మడు అక్కడకు వెళ్లిన తర్వాత కథ ఇదే. ఎమోషన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వషిష్ట తెరకెక్కిస్తోన్న `విశ్వంభర` స్టోరీ కూడా రివీల్ చేసారు. మొత్తం 14 లోకాల్లో కింద ఏడు..పైన ఏడు ఉంటాయి. వాటిపైన ఉన్న మరోటి సత్యలోకం. ఈ నేపథ్యంలోనే కథ సాగుతుంది. అక్కడ ఉన్న హీరోయిన్ ను హీరో భూమ్మీదకు ఎలా తీసుకొస్తాడు? అన్నదే సినిమా. హీరోయిన్ కోసం హీరో చేసిన పోరాటమే ఈ కథ. సోషియా ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు.
అలాగే యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తోన్న మిరాయ్ కథను కూడా ముందుగానే రివీల్ చేసారు. కథను ఇలా ముందుగానే చెప్పడం వల్ల ఆడియన్స్ మైండ్ ఫిక్సై ఉంటుంది. ఏదో ఊహించుకుని థియేటర్ కు వచ్చే పరిస్థితి ఉండదు. తెలిసిన కథే కాబట్టి దాన్ని ఎంత గొప్పగా చెప్పాడు? అన్నదే ఆలోచిస్తారు. ఓ రకంగా ఇది హిట్ స్రాటజీ అనే అనాలి. కథని చెప్పకపోతే కనెక్ట్ కాక అర్దం కాని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. `సలార్` విషయంలో అదే నెగివిటీకి దారి తీసిన సంగతి తెలిసిందే.