• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  ఢిల్లీ కాదు... గల్లీలోనే...

ఢిల్లీ కాదు... గల్లీలోనే ..కిషన్ రెడ్డి పక్కా వ్యూహం

| కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో నశా ముక్త్ భారత్ పేరుతో ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు రాష్ట్రంలో తన రాజకీయ ప్రాధాన్యతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

By - Satya P
Update: 2026-11-27 03:57 GMT

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మొదట సహాయ మంత్రిగా చేరారు. ఇక ఇపుడు కేబినెట్ మంత్రి హోదాలో పనిచేస్తున్నారు. రెండు సార్లు సికింద్రాబాద్ లోక్ సభ సీటు నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి కూడా రెండు సార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కేంద్ర స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణాలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని బీజేపీ జాతీయ పెద్దలు పంతం పట్టి ఉన్నారు. కేంద్ర పెద్దలు పంతం పడితే ఎలా ఉంటుందో పశ్చిమ బెంగాల్ నిరూపించింది. మమతా బెనర్జీ వంటి ఐరన్ లేడీనే ఓడించిన బీజేపీ ఇపుడు తెలంగాణా ఫోకస్ పెట్టింది అంటే వెనక భారీ కసరత్తు ఉంటుంది అని అంటున్నారు.

సీనియర్ మోస్ట్ లీడర్ గా :

ఇక కిషన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన 1980 నుంచే బీజేపీ అనుబంధ సంస్థలలో పనిచేస్తూ వస్తున్నారు. ఏబీవీపీ నుంచి వచ్చిన ఆయన బీజేపీ యువ మోర్చా నాయకుడిగా అలాగే ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విభజన తరువాత తెలంగాణా అధ్యక్షుడిగా వివిధ హోదాలలో పార్టీ కోసం పనిచేశారు. ఆయన లోక్ సభ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల మీదనే మక్కువ ఎక్కువగా చూపిస్తారు అని అంటున్నారు. ఇక బీజేపీ కనుక తెలంగాణాలో అధికారం దిశగా అడుగులు వేస్తే సీఎం చాయిస్ గా కిషన్ రెడ్డి ఫస్ట్ లో ఉంటారని అంటున్నారు. ఈ క్రమంలో తన పలుకుబడిని ఆయన మరింతగా పెంచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.

పాదయాత్రతోనే :

ఇక నశా ముక్త్ భారత్ పేరుతో రాజకీయాలకూ అతీతంగా పాదయాత్రను కిషన్ రెడ్డి చేపట్టారు. దీనికి సినీ సెలబ్రిటీస్ నుంచి వివిధ వర్గాలకు చెందిన బిగ్ షాట్స్ ని కూడా మద్దతుగా తీసుకుని వచ్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు అడుగులు వేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వం నినాదం కూడా నశా ముక్త్ భారత్ అన్నది. దాంతో కీలక సమయంలో దానిని అందిపుచ్చుకుని కిషన్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా ఒక ప్రజా చైతన్యాన్ని రగిలిస్తూ కీలక సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాలలో మమేకం అవుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. రాజకీయంగా ఆయన తన పరపతిని కచ్చితంగా ఈ పాదయాత్ర ద్వారా మరింతగా పెంచుకుంటారు అని కూడా అంటున్నారు.

మార్పు చేర్పులలో :

ఇక బీజేపీ కనుక సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసే క్రమంలో అయినా లేదా ఇతరత్రా ఏమైనా చేసినా కిషన్ రెడ్డి తనదైన పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. కిషన్ రెడ్డి మాస్ లీడర్ గా కాకుండా సాఫ్ట్ నేచర్ తో ఉంటారు అని పేరుంది. అయితే ఆయన పదునైన వ్యూహాలను రచించడంలో దిట్ట అని అంటారు. ఇపుడు కూడా ఆయన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగానే తన పాదయాత్రతో అటు పార్టీకి మేలు చేస్తూనే అదే సమయంలో తన ఇమేజ్ ని కూడా మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కిషన్ రెడ్డి ఢిల్లీలో కంటే గల్లీ మీదనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు అన్నది అయితే చర్చగా రాజకీయాల్లో సాగుతోంది.

Tags:    
  • kishanreddy 
  • telangana 
  • bjp 
  • telanganapolitics 
  • nashamuktbharat 

Similar News

కవితక్క టీఆర్ఎస్ కి పేరు మార్పు తప్పదా ?

2026-11-27 03:56 GMT

తెలంగాణ నీళ్ల పంచాయితీలో కొత్త ట్విస్ట్.. తప్పు కేసీఆర్‌దా? కాంగ్రెస్‌దా?

2026-11-27 02:29 GMT

బీజేపీకి అంత సీన్ లేదు...కమలం గుండెల్లో రేవంత్ గునపాలు !

2026-11-27 02:25 GMT

హైదరాబాద్‌లో యాపిల్ తొలి స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం!

2026-11-27 02:24 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

కారు నాది.. పెట్రోల్ నాది.. రోడ్డుపై వెళ్లాలంటే ట్యాక్స్ కట్టాలా? హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్‌పై నెటిజన్ల సెటైర్లు

2026-11-26 05:47 GMT

అక్కడి నుంచే పోటీ.. ఆ నియోజకవర్గమే ఎందుకు? కవిత నిర్ణయం వెనుక అసలు కథేంటి?

2026-11-25 12:42 GMT

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!

2026-11-25 07:05 GMT

'వందల కోట్ల' బాంబుతో రేవంత్ పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

2026-11-25 07:04 GMT

సందీప్ సర్దుబాట ... కాంగ్రెస్ కి రాచ బాటేనా ?

2026-11-25 04:02 GMT

కవితక్క...సెటిలర్ల అస్త్రం..

2026-11-24 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS